బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు.. అంతకుముందు జరిగిన ఆయన మాజీ మేనేజర్ దిశ సలియాస్ ఆత్మహత్యకు లింకు ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ముంబైలోని ఓ భారీ బిల్డింగ్ 14వ అంతస్తు నుంచి సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియాస్ దూకి ఆత్మహత్య చేసుకుంది.
దిశా సలియాన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పబ్లిక్ రిలేషన్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించిన దిశ సినీ ప్రముఖులకు మేనేజర్ గా ఎదిగారు. గతంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, కమెడియన్ భారతీ శర్మ, హీరోయిన్ రియా చక్రవర్తి, హీరో వరుణ్ శర్మకు మేనేజర్ గా ఈమె పనిచేశారు. చనిపోయే ముందు సుశాంత్ సింగ్ కు పనిచేస్తున్నట్టు సమాచారం.
ఈ కేసులోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను పోలీసులు విచారించారు. దీంతో సుశాంత్ చాలా ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. అయితే దిశను సుశాంత్ రెండు సార్లు మాత్రమే కలిశాడని.. సుశాంత్ టాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థ నిర్వాహకుడు ఉదయ్ సింగ్ గౌరీ పోలీసులకు వివరణ ఇచ్చారు.
తన మేనేజర్ సూసైడ్ తో పోలీసులు విచారించడంతో సుశాంత్ డిప్రెషన్ మందులు వాడడం కూడా ఆపేశాడని అతడి స్నేహితులు తెలిపారు. ఎవరైనా పోలీసులు ప్లాన్ చేసి సుశాంత్ ను బెదిరించడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఇదివరకు చాలా మంది బాలీవుడ్ టాలెంట్ మేనేజర్లు, కాస్టింగ్ మేనేజర్లను కూడా పోలీసులు ప్రశ్నించారు. సుశాంత్ ఆత్మహత్యకు అసలు కారణంపై పోలీసులు పరిశోధన చేస్తూనే ఉన్నారు.