పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హై వోల్టేజ్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `భీమ్లా నాయక్`. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయ్యరే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల ఫేమ్ సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. గత కొన్ని రోజులుగా రిలీజ్ పరంగా సందిగ్ధంలో వున్న ఈ మూవీ ఎట్టకేలకు ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది.
పవర్ స్టార్ అభిమానులు గత కొన్ని నెలలుగా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఈ మూవీ మొత్తానికి రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మూవీ రిలీజ్ అవుతుండటంతో ఒక్కసారిగా సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు.
మూవీ రిలీజ్ కు మూడు రోజులు మాత్రమే వుండటంతో నెట్టింట ఈ మూవీ కి ఫ్యాన్స్ భీభత్సమైన ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ కావడంతో , అందులో పవన్ ఓ రేంజ్ లో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ని అందించడంతో ఫ్యాన్స్ పూనకాలు మొదలయ్యాయి.
ట్రైలర్ రిలీజ్ .. రిలీజ్ డేట్ ప్రకటన తో బాక్సాఫీస్ వద్ద `భీమ్లా నాయక్` హంగామా మొదలైంది. ట్రైలర్ లో పవన్ , రానాల పాత్రలకు ఏ మాత్రం తగ్గకుండా పోటా పోటీగా వుండటం సినిమాపై మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది. మలయాళ రీమేక్ ని మించి తెలుగు వెర్షన్ లో భారీగా మార్పులు చేశారంటూ ముందు నుంచి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అందరి కళ్లు ట్రైలర్ కోసం ఎదురుచూశాయి. అయితే ఏ ఒక్కరి పాత్రని తగ్గించుకుండా ఇద్దరి పాత్రల్ని సమానంగా మలిచారని స్పష్టమైంది. దీంతో అభిమానులు సినీ లవర్స్ థియేటర్లలో ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో వార్ వుండబోతోందని, థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు.
ఇక ట్రైలర్ లో పొలిటికల్ పంచ్ లతో భీమ్లా హీటెక్కించబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. `నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలకి వస్తే.. కష్టం వాడికి` అంటూ పవన్ చెప్పిన డైలాగ్ లు నెట్టింట పోలిటికల్ హీటెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ డైలాగ్ ద్వారా ఏపీ రాజకీయాలకు పవర్ ఫుల్ సంకేతాన్ని పవన్ పంపించాడని నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఏపీలో టికెట్ రేట్ల వివాదం ఓ కొలిక్కి రానున్న నేపథ్యంలో `భీమ్లా నాయక్` రిలీజ్ అవుతోంది. దీంతో పొలిటికల్ హీట్ ఏమైనా వుంటుందా? వుంటే పవన్ రియాక్షన్ ఎలా వుండబోతోంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ `భీమ్లా నాయక్` డైలాగ్ నెట్టింట వైరల్ గా మారడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాలో పొలిటికల్ పంచ్ లు ఇంకా వున్నాయా? శాంపిల్ గా ఒక డైలాగ్ ని మాత్రమే ట్రైలర్ లో పెట్టారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.