టీజర్లోనే మహేష్ సెటైర్లు??
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం.. కెరీర్ లోనే తొలిసారి మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనుండటం వంటివి ఈ మూవీపై బజ్ విపరీతంగా పెంచాయి. ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా కొలిక్కి వచ్చింది.
భరత్ అనే నేను సినిమాలో మహేష్ సీఎం కనిపిస్తాడనే న్యూస్ బయటికొచ్చినప్పటి నుంచి ఇందులో పొలిటికల్ ఎలిమెంట్స్ ఏమేం ఉంటాయా అన్నదానిపై ఆసక్తి పెరిగింది. ఈ ఆసక్తి మరింత పెంచేలా అదిరిపోయే పొలిటికల్ సెటైర్ డైలాగులు ఉన్న టీజర్ ఒకటి కట్ చేశారట. కాని రిలీజ్ కు ముందు లేనిపోని వివాదాలు ఎందుకనే ఉద్దేశంతో దానిని ఎందుకు రిలీజ్ చేయడం అని మాని మహేష్ విజన్ అంటూ ఒకటి తెస్తున్నారు. అందులో కూడా ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలి.. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటూ మహేష్ సెటైర్ పేలుస్తాడట. ఈ డైలాగ్ అన్ని పార్టీలకు తగులుతుందని టాక్.
డైరెక్టర్ కొరటాల శివ సినిమాల్లో కథతోపాటు డైలాగులు కూడా జనాలకు బాగా కనెక్టవుతాయి. శ్రీమంతుడు సినిమాలో ఊరికి ఏదో ఒకటి తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ బాగా పేలింది. కాకపోతే భరత్ అనే నేను పొలిటికల్ మూవీ కాబట్టి డైలాగుల్లో సెటైర్ల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడట. ఈ తరహా సినిమాల్లో జనాలతో విజిల్స్ వేయించేది డైలాగులే కాబట్టి కొరటాల కూడా ఆ విషయంలో వాళ్లను నిరాశ పరచకుండా ప్లాన్ చేస్తున్నాడని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. ఈనెల 6న భరత్ అనే నేను టీజర్ రిలీజ్ తో ఈ సెటైర్లు ఏ రేంజిలో ఉంటాయో తెలిసిపోతుంది.