`నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి వదిలిన డైలాగ్ ఎన్ని ప్రకంపలను సృష్టించిందో? చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి చెప్పింది `గాడ్ ఫాదర్` సినిమా డైలాగ్ అయినా? సినిమా హైడ్ అయి..చిరంజీవి మళ్లీ పొలిటికల్ మ్యాకప్ వేసుకుంటున్నారా? అన్న అంశం ప్రధానంగా నెట్టింట చర్చకొచ్చింది.
ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. రాజ్యసభ సభ సభ్యుడిగా కొనసాగినా? మెగా ఇమేజ్ ముందు పొలిటికల్ పవర్ ఎంత ? అనిపించింది. అటుపై చిరంజీవి పూర్తిగా సినిమాల్లో బిజీ అవ్వడం.. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినా దాని గురించి చిరంజీవి పెద్దగా పట్టించుకోకపోవడం వంటి అంశాలు చిరు రాజకీయ అనాసక్తిని తెలియజేసాయి.
కానీ తాజా డైలాగ్ మాత్రం ఫ్యాన్స్ లో పునకాలు తెప్పిస్తుంది. సినిమా డైలాగ్ కి బధులుగా? మళ్లీ రియల్ రాజకీయాల్లోకి దిగితే బాగుంటుందని...తమ్ముడుకి మద్దుతుగా నిలిస్తే ఇంకెంత బాగుంటుందంటూ! నెట్టింట చర్చకొస్తుంది. ఆ సంగతి పక్కనబెడితే గాడ్ ఫాదర్ లో ఇలాంటి పొలిటికల్ డైలాగులు ఇంకా చాలానే ఉన్నాయనిది సమాచారం.
ఇందులో చిరంజీవి పొలిటికల్ లీడర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి ఆహార్యం ఆద్యంతం ఆకట్టకుంది. చిరంజీవి `గాడ్ పాదర్` గా ఎవరికి నిలవబోతున్నారు? అన్న అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి డైలాగ్ అభిమానుల్లో కాకలు పుట్టిస్తుంది. ఇలాంటి డైలాగులు సినిమాలో మరిన్ని వుంటే అగ్గిరాజుకోవడం తధ్యం అంటున్నారు.
అటు ప్రచార చిత్రాలు మరోవైపు చిరుని అంతకంతకు పైకి లేపుతున్నాయి. అభిమాన స్టార్ ని ఫ్యాన్స్ గ్రేట్ పొలిటీషన్ గా ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం వెడెక్కుతోన్న నేపథ్యంలో చిరు నోట పొలిటికల్ డైలాగ్ అన్ని పార్టీల్లోనూ ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ ఏ పార్టీ వెనుక అంటూ! గెస్సింగ్ తెరపైకి వస్తున్నాయి.
సినిమాలో మాత్రం చిరు పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇందులో చిరుకు జోడీగా నయనతార నటిస్తుంది. సల్మాన్ ఖాన్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.