బాలీవుడ్లో లవ్ ఎఫైర్లు.. బ్రేకప్ లు.. సెకండ్ మ్యారేజ్ లు చాలా చాలా కామన్. బాలీవుడ్ సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారికి కూడా ఈ విషయం తెలుసు.. అందుకే ఏవైనా బ్రేకప్ న్యూసులు.. ఎఫైర్ కథనాలు వస్తే పెద్దగా షాక్ అవ్వరు. ప్రస్తుతం సీనియర్ బాలీవుడ్ బ్యూటీ పూజా బత్రా లవ్ ఎఫైర్ హాట్ టాపిక్ అయింది. ఈ భామ ఎవరంటారా? 1993 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్. బాలీవుడ్ లో దాదాపు పాతిక సినిమాల్లో నటించింది. తెలుగులో అక్కినేని 'సిసింద్రీ'.. 'గ్రీకు వీరుడు' లో కూడా నటించింది.
పూజ బత్రా 2002 లో డా. సోను అహ్లూవాలియాను వివాహం చేసుకుంది. అయితే అభిప్రాయభేదాల కారణంగా 2011 లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ బ్యూటీ సింగిల్ గా కాలం వెళ్ళదీస్తోంది. అయితే కొంతకాలంగా బాలీవుడ్ నటుడు నవాబ్ షాతో లవ్వులో ఉందట. ఇద్దరూ విహార యాత్రలకు పోతూ.. ఘాటుగా డేటింగ్ చేస్తూ ప్రేమలోకంలో హాయిమైకంలో మునిగిపోతున్నారట. రీసెంట్ గా ఒకసారి ఈ భామ నవాజ్ షా తో ఉన్న ఒక ఫోటో ను షేర్ చేసి 'ఎవిరీ డే మ్యాన్ క్రష్' అని క్యాప్షన్ ఇచ్చింది. పాపం ఈ క్యాప్షన్ ను చూసి కొందరు "రోజూ నన్ను నలిపేస్తాడు" అని అనువాదం చేసుకున్నారు. అలా జరగడం నిజమేమో మనకు తెలీదు కానీ.. ఆ ఫ్రేజ్ మీనింగ్ మాత్రం అది కాదు. "రోజూ నీ మాయలో పడుతుంటాను" అని రఫ్ గా అర్థం.
ఈ సంగతి పక్కనపెడితే పూజ బత్రా - నవాబ్ షా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వచ్చాయి. హంగామా లేకుండా సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగిందని అంటున్నారు. అయితే ఈ విషయంపై పూజా బత్రా - నవాబ్ షా స్పందించాల్సి ఉంది. ఈ నవాబ్ షా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' లో నటిస్తున్నాడు. గతంలో షా 'భాగ్ మిల్ఖా భాగ్'.. 'దిల్వాలే'.. 'టైగర్ జిందా హై' లాంటి చిత్రాలలో కూడా నటించాడు. తెలుగులో బాలయ్య 'డిక్టేటర్' సినిమాలో నటించాడు.