ముందు ఆ బాబాలను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఈ నటుడిని అరెస్ట్ చేయండి : పూజా
బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ తన 55వ పుట్టిన రోజు సందర్బంగా గోవాలో ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు గాను గోవాలోని బీచ్ లో నగ్నంగా పరుగులు తీసిన విషయం తెల్సిందే. గోవా బీచ్ లో నగ్నంగా పరుగులు తీసి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు అంటూ మిలింద్ సోమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో ఆయనకు కొందరు మద్దతుగా నిలుస్తుండగా మరి కొందరు మాత్రం ఆయన తీరును వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మిలింద్ సోమన్ కు మద్దతుగా బాలీవుడ్ స్టార్ పూజా బేడీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
మిలింద్ షేర్ చేసిన ఫొటోలో ఎలాంటి అసభ్యత లేదు. అదో అద్బుతమైన ఫొటో. అసభ్యత అనేది చూసే వాడిని బట్టి ఉంటుంది. నగ్నత్వం అనేది నేరం అయితే మన దేశంలో ఉన్న నాగబాబాలు అందరిని కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఒంటికి బూడిద రాసుకుని నగ్నంగా తిరిగే వారిని ఒప్పుకుంటారు. అలాంటప్పుడు మిలింద్ సోమన్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిలింద్ సోమన్ నటుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి తన ఫిట్ నెస్ ను చూపించేందుకు అందమైన ఫొటోను షేర్ చేశారు. దాన్ని తప్పుడు ఉద్దేశ్యంతో చూసి విమర్శలు చేస్తున్నారంటూ పూజా అసహనం వ్యక్తం చేసింది.
Full View Full View Full View