'రాధేశ్యామ్‌' కథ గురించి పూజా కామెంట్స్‌

Update: 2021-10-02 04:30 GMT
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రూపొందిన రాధే శ్యామ్‌ సినిమా చిత్రీకరణ ముగిసింది. సంక్రాంతికి సినిమా విడుదల కాబోతుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కోసం అభిమానులు చాలా నెలలుగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలోనే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కరోనా పరిస్థితులు తేరుకుని సినిమా పరిశ్రమ మళ్లీ పూర్వ స్థితికి వస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి రాధే శ్యామ్‌ విడుదల చేయబోతున్నారు. రాధే శ్యామ్‌ లో ఒక అద్బుతమైన ప్రేమ కథను చాలా స్టైలిష్ గా చూపించబోతున్నట్లుగా మొదటి నుండి చెబుతున్నారు. సినిమా చూస్తుంటే ఒక కంటికి ఇంపైన ఆర్ట్‌ ను.. కలరింగ్‌ ను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటున్నారు.

1980 ఇటలీ బ్యాక్‌ గ్రౌండ్‌ లో జరిగే కథ తో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా ఇదే ఫాంటసీ కథ అనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఇప్పటి వరకు సినిమా కథ గురించి ఒక స్పష్టమైన క్లారిటీ రాలేదు. ఈ సమయంలో రాధే శ్యామ్‌ కథ గురించి పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఇప్పటి వరకు పలు ప్రేమ కథలు చేశాను. కాని ఈ సినిమా అన్నింటి కంటే ప్రత్యేకం అంటూ వ్యాఖ్యలు చేసింది. ఒక అద్బుతమైన ప్రేమ కథను చూపించబోతున్నాం. ప్రేక్షకులు ఈ సినిమా ను ఖచ్చితంగా ఆస్వాదిస్తారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాధే శ్యామ్‌ సినిమా కథ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందనే నమ్మకంను పూజా హెగ్డే వ్యక్తం చేసింది.

ప్రభాస్ రాధే శ్యామ్‌ ఈ సంక్రాంతికి విడుదల కాబోతుండగా.. వచ్చే ఏడాదిలోనే కేజీఎఫ్‌ డైరెక్టర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మరియు రామాయణ ఇతివృత్తంతో రూపొందుతున్న ఆదిపురుష్‌ లు కూడా విడుదల కాబోతున్నాయి. ఒకే ఏడాది మూడు భారీ సినిమాలను విడుదల చేయబోతున్న ప్రభాస్‌ ఆ తర్వాత పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్‌ కే ను చేయబోతున్నాడు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా లో అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ చేసిన చేస్తున్న సినిమా కథలు అన్ని కూడా అద్బుత ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లేలా ఉంటాయని కామెంట్స్ వస్తున్నాయి. బాలీవుడ్‌ లో ప్రభాస్ అన్ని సినిమాలు కూడా వందల కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News