ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న రాధేశ్యామ్ రెండు వారాల చిత్రీకరణ పూర్తయితే రిలీజ్ కి లైన్ క్లియరైనట్టేనని తెలుస్తోంది. అయితే ప్రభాస్ తదుపరి సలార్ .. ఆదిపురుష్ చిత్రీకరణలకు సిద్ధమవుతున్నారని ఆ తర్వాతే రాధేశ్యామ్ పెండింగ్ పార్ట్ తెరకెక్కుతుందని కథనాలొచ్చాయి.
కానీ ఇది నిజం కాదేని రాధేశ్యామ్ కథానాయిక పూజా హెగ్డే నుంచి క్లారిటీ వచ్చేసింది. రాధేశ్యామ్ సెట్స్ లో చిత్రీకరణకు జాయినవుతున్నానని పూజా హింట్ ఇవ్వడంతో దీనిపై డైలమా పూర్తిగా క్లియరైంది. రాధేశ్యామ్ పెండింగ్ చిత్రీకరణ కేవలం 14 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని చిత్రబృందం సన్నాహకాల్లో ఉంది. ఆ తర్వాతే ప్రభాస్ సలార్.. ఆదిపురుష్ చిత్రాల సెట్స్ కి వెళతారు. అటుపైనా నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని స్టార్ట్ చేసేందుకు లైన్ క్లియరవుతుందని భావిస్తున్నారు.
రాధేశ్యామ్ దసరా బరిలో రిలీజ్ కి వస్తుందని ప్రచారం సాగుతుండగా.. సలార్.. ఆదిపురుష్ చిత్రాలు 2022లో రిలీజ్ చేయాలన్న ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. నాగ్ అశ్విన్ సినిమా పై 2022 చివరి నాటికి కానీ క్లారిటీ రాకపోవచ్చు.