హీరోలతో పోల్చితే హీరోయిన్స్ ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో పదేళ్లు కొనసాగింది అంటే ఆమె సినిమాల సంఖ్య 20 నుండి 30 వరకు ఉండవచ్చు. కాని పూజా హెగ్డే విషయంలో అలా జరగలేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 7 ఏళ్లు అయినా కూడా ఇంకా పూజా హెగ్డే 8 సినిమాలు మాత్రమే చేసింది. ఈమె కెరీర్ లో రెండు సంవత్సరాలు బాలీవుడ్ మొహెంజదారో చిత్రం కోసం వృదా చేసింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు జోడీగా ఆ చిత్రంలో నటించిన పూజా హెగ్డే సక్సెస్ ను దక్కించుకోలేక పోవడంతో పాటు - రెండేళ్ల సమయంను వృదా చేసుకుంది. టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో పూజా హెగ్డే అక్కడకు వెళ్లి పోయింది.
బాలీవుడ్ సినిమా అవ్వడంతో పాటు - స్టార్ హీరో సినిమా - భారీ బడ్జెట్ సినిమా కావడం వల్ల రెండు సంవత్సరాల పాటు బల్క్ డేట్లను వారికి ఇచ్చాను. కాని ఆ సమయంలో తాను చేసిన తప్పు ఎంత పెద్దదో నాకు ఆ తర్వాత అర్థం అయ్యింది. ఎంత పెద్ద సినిమా అయినా - ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా కూడా ఎక్కువ డేట్లు ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేను అనుభవం ద్వారా తెలుసుకున్నట్లుగా పూజా పేర్కొంది.
ఆ రెండు సంవత్సరాలు వృదా చేయకుండా ఉండి ఉంటే తన సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండేదని - తప్పకుండా ఆ గ్యాప్ లో అయిదు ఆరు సినిమాలు చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. మరెప్పుడు కూడా ఒక సినిమా కోసం నెలల తరబడి డేట్లు ఇవ్వను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న ఈ అమ్మడు ప్రభాస్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది.