అరవింద్ గారి నుంచి మెసేజ్ రావడంతో టెన్షన్ పడిపోయాను: పూజ హెగ్డే

Update: 2021-10-09 03:32 GMT
ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ పూజ హెగ్డే పేరు ఒక మంత్రంలా వినిపిస్తోంది. ఈ నాజూకు భామ నయగారాలు చూడటానికి కుర్రాళ్లు ఉత్సాహ పడుతున్నారు. తన  క్రేజ్ కి తగిన డిమాండ్ తో ఆమె దూసుకుపోతోంది. ఇక ఈ సుందరి చేసిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకుంటూ ఉండటంతో, ఆమెను వరుస అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె తాజా చిత్రంగా ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆమె సన్నజాజిలా మెరిసింది.

ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ ..  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' .. ఈ సినిమా నా కెరియర్లో చాలా స్పెషల్ గా నేను భావిస్తున్నాను. ఇంతమంచి పాత్ర ఇచ్చినందుకు నేను భాస్కర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి .. నటించడానికి మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది. అలాంటి ఈ పాత్ర లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ కూడా నా పాత్ర వెంటనే కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నాకు బాగానచ్చిన పాట 'లెహరాయి' .. 'సామజ వర గమన' తరువాత నేను ఎక్కువసార్లు విన్న పాట ఇదే.

నేను ఎంతగానో అభిమానించే నిర్మాతలలో అల్లు అరవింద్ గారు ఒకరు .. నాలుగు రోజుల క్రితం నేను ఒక సినిమా షూటింగుకి వెళుతుంటే, ఆయన నుంచి ఒక మెసేజ్ వచ్చింది. సాధారణంగా ఆయన ఎవరికీ మెసేజ్ లు చేయరు. అందువలన ఆయన నుంచి మెసేజ్ వచ్చేసరికి షాక్ అయ్యాను .. టెన్షన్ పడిపోయాను. దేవుడికి ఒకసారి దణ్ణం పెట్టుకుని ఆ మెసేజ్ చదివాను. ఈ సినిమాలో నా నటనను మెచ్చుకుంటూ పెట్టిన మెసేజ్ అది. అది చదవగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయనకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను.

తెలుగులో నా ఫస్టు హీరో నాగచైతన్య .. ఆయనతోనే కెరియర్ పరంగా ఇక్కడ నా ప్రయాణం మొదలైంది. ఆ తరువాత చైతూ ఎంతగా ఎదుగుతూ వెళ్లారనేది అందరికీ తెలిసిందే. చైతూ మంచి నటుడే కాదు .. మంచి మనసున్నవాడు కూడా .. అదే ఆయన బలం కూడా. ఇక అఖిల్ తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. సెట్లో అఖిల్ చాలా సరదాగా ఉండేవాడు .. ఆయన ఇచ్చిన ఆ కంఫర్ట్ జోన్లో చేసినందువల్లనే మా మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అందుకు నేను అఖిల్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి.

కరోనా కారణంగా అందరూ  చాలాకాలంగా వినోదానికి దూరమైపోవలసి వచ్చింది. ఆ సమయంల్లో మానసిక పరమైన వత్తిడిని కూడా అనుభవించారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి సినిమా అనేది ఒక ఔషధంలా ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో కావాల్సినంత వినోదంతో  పాటు, మంచి మెసేజ్ కూడా ఉంది. అందువలన అందరూ కూడా థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు" అని చెప్పుకొచ్చింది.         
Tags:    

Similar News