జ్ఞాపకాలంటే గతానికి గుర్తులు. ఒక ఫోటో చాలు మనల్ని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళడానికి. ఫొటోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కావచ్చు.. లేదా మణి సార్ సినిమాలోని ఒక లవ్ సీన్ కావొచ్చు. ఇవన్నీ కాకుండా వర్మ సినిమాలోని వయోలెంట్ షాట్ కావచ్చు ఏవైనా మనల్ని ఓ దశాబ్దం లేదా రెండు మూడు దశాబ్దాల వెనక్కు తీసుకెళ్తాయి. ఇక కొన్ని అంతరించి పోయిన వస్తువులు కూడా అంతే.
అలాంటి అంతరించిపోయిన వస్తువులలో టేప్ రికార్డర్ ఒకటి. టేప్ రికార్డర్ లో ప్లే.. రివర్స్.. ఫాస్ట్ ఫార్వార్డ్.. పాజ్.. స్టాప్ బటన్లు... వీటితో పాటు రికార్డ్ బటన్ కూడా ఉంటుంది. ఇక ఇవన్నీ పని చేయాలంటే ఒక క్యాసెట్ ఉండాలి కదా. దానికి 'ఎ' సైడ్.. 'బీ' సైడ్ ఉంటుంది. ఒక్కో సైడ్ లో మూడో నాలుగో పాటలు ఉంటాయి. అప్పట్లో జనరల్ గా సినిమాలో ఐదారు పాటలు ఉండేవి కాబట్టి సగం ఎ సైడ్ లో సగం బీ సైడ్ లో ఉండేవి. మరి ఈ క్యాసెట్ సంగతి ప్రెజెంట్ జెనరేషన్ కు తెలియకపోవచ్చు గానీ 90 ల జనరేషన్ కు అదొక తీపి జ్ఞాపకం. మరి దీన్నే ఉబర్ ఈట్స్ ఇండియా వారు 'నైన్టీస్ నోస్టాల్జియా.. నైన్టీస్ రేట్స్' పేరుతో ఈమధ్యే ఒక అడ్వర్టైజ్ మెంట్ క్యాంపెయిన్ ప్రారంభించారు. అంటే ఈ యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే 90 ల జనరేషన్ రేట్లకు ఫుడ్ వస్తుందనే కాన్సెప్ట్.. దాంతో పాటు 'బ్యాక్ టు ది నైన్టీస్' పేరుతొ మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా డీజే బ్యూటీ పూజా హెగ్డే ఉబర్ ఈట్స్ ఇండియా లో ఫుడ్ ఆర్డర్ చేస్తే తనకు ఒక టేప్ రికార్డర్ క్యాసెట్ గిఫ్ట్ గా వచ్చిందని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.
వాళ్ళకు థ్యాంక్ యు చెబుతూ.. నన్ను 90 ల లోకి తీసుకెళ్లారని అప్పట్లో క్యాసెట్లు పెట్టి బాలీవుడ్ సూపర్ హిట్ పాటలకు తనివితీరా డ్యాన్స్ చేసేదాన్నని తెలిపింది. అంతే కాకుండా మీరు నైన్టీస్ నోస్టాల్జియా లో ఆర్డర్ చెయ్యండి 90 ల రేట్లకు ఫుడ్ ను పొందండి అని చెప్పింది.
దాంతో పాటుగా మీకు 90 లలో ఇష్టమైన పాట ను కామెంట్స్ లో చెప్పండి అంటూ నెటిజనులను కోరింది. ఇంకేముంది.... తూ చీజ్ బడి హై మస్త్ మస్త్ - జాదూ తేరీ నజర్ - ఏ కాష్ కే హమ్ హోష్ మే హమ్ అబ్ ఆనే న పాయె.. లాంటి పాటలతో కొంతమంది కామెంట్స్ పెట్టారు.. ఇక పనిలో పనిగా కొంతమంది 'మీకు జాబ్ కావాలా ఈ నంబర్ కి ఫోన్ చెయ్యండి'.. 'మీకు సంసారం లో సమస్యలు ఉన్నాయా.. ఉద్యోగం ఊడిందా.. వ్యాపారంలో నష్టం వచ్చిందా ఈ సిద్ధాంతి ని కలవండి' అంటూ కూడా కొంతమంది తగులుకున్నారు. ఎవడి గోల వాడిది... భం భం భోలేనాథ్!!