తెలుగు మాట్లాడటం పెద్దగా రాదు. ఆ మాటకు వస్తే తెలుగు మాట్లాడటం నేర్చుకోలేదు కూడా. కానీ.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పేస్తూ.. తన మాటలతో ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తున్న క్రెడిట్ పూజా హెగ్డేకు ఇవ్వాలి. పుట్టింది ముంబయి అయినా.. పేరెంట్స్ మాత్రం కన్నడిగులు. తన మాతృ భాష అయిన తుళుతో పాటు.. కన్నడ.. హిందీ.. ఇంగ్లిషులో దంచి కొట్టేయగలదు. ఇప్పుడు తెలుగు కూడా మాట్లాడుతోంది. అంతేనా.. తన పాత్రలకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటుంది.
తెలుగును నేర్చుకోకున్నా.. దాని మీద ఉన్న ఆసక్తితో తను కలిసి పని చేసే వారితో మాట్లాడటం ద్వారా భాషను నేర్చుకుంది పూజా. తాను నటించిన పాత్రలకు తాను డబ్బింగ్ చెప్పుకోవటం వెలితిగానే కాదు.. తన పాత్రకు తగ్గట్లు డబ్బింగ్ ఆర్టిస్టులు సరిగా డబ్బింగ్ చెప్పటం లేదన్న భావన పూజాలో ఉండేదట.
దీంతో.. తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోవాలన్న విషయాన్ని అరవింద సమేత చిత్ర సమయంలో దర్శకుడితో షేర్ చేసుకుందట. సర్.. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. బాగుంటే పెట్టండి. లేకుంటే తీసేయండని చెప్పిందట. అందుకు త్రివిక్రమ్ ఓకే చెప్పటం.. ఆమె డబ్బింగ్ ఆయనకు నచ్చటంతో అలా ఉంచేశారట. అలా అరవింత సమేతలో తన పాత్రకు తాను తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పిందట. అది అందరికి నచ్చటంతో తాజాగా చేసిన అల వైకుంఠపురములో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న విషయాన్ని పూజా వెల్లడించారు. భాష రాకున్నా.. డబ్బింగ్ చెప్పి మెప్పించిన పూజా టాలెంట్ కు ఫిదా కావాల్సిందే.