ఫోటో స్టోరీ: మతులు పోగొట్టే మెరుపుతీగ

Update: 2018-02-17 04:39 GMT
నాజూకు నడుము ఒంపుల వయ్యారం.. నడిచే చందమామ లాంటి లావణ్యం.. చూడగానే మతులు పోగొట్టే మేని సింగారం కన్నడ సీమ నుంచి దిగొచ్చిన సుందరాంగి పూజా హెగ్డేకే సొంతం. ముందు సంప్రదాయానికి చీర కట్టినట్టు ఉండే పాత్రల్లోనే కనిపించినప్పుడు అందంగా ఉందనే పేరొచ్చింది కానీ అవకాశాలే అంతగా రాలేదు. బాలీవుడ్ లో మొహెంజొదారో లాంటి భారీ చిత్రం చేసినా కెరీర్ కు ఒరిగిందేం లేకపోయింది.   

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో రూటు మార్చింది. అందాల ఆరబోతతో అందరినీ తెగ కవ్వించింది. దాంతో కుర్రకారు పూజ పేరే పలవరించడం మొదలెట్టారు. దాంతో ఇటు సినిమాల్లోనే కాదు... పబ్లిక్ ఫంక్షన్లలోనూ హాటుహాటుగానే కనిపిస్తూ అందరికీ హీటెక్కించడమే పనిగా పెట్టుకుంది. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కు అమ్మడు రెడీ అయి వచ్చిన తీరు అందరినీ ఊపిరి తీసుకోవడం మరిచిపోయేలా చేసింది. క్లీవేజ్ అందాలు ఆసాంతం ఆరబోస్తూ బ్లాక్ కలర్ డ్రస్ లో అప్పరస అనిపించేలా కనిపించింది. నెలవంకలాంటి మెడపై ఓ డిజైనర్ నెక్లెస్ తో రాకుమారి దిగొచ్చిందేమో అనిపించింది.

దువ్వాడ జగన్నాథమ్ తరవాత పూజాకు ఆఫర్లు బాగానే వచ్చాయి. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సాక్ష్యం సినిమాకు ఆమెను ఏరికోరి హీరోయిన్ గా తీసుకున్నారు. గ్లామర్ గర్ల్ గా వచ్చిన గుర్తింపును మరికొంత కాలం కంటిన్యూ చేయడమే లక్ష్యంగా పూజా ప్లానింగ్ గా కనిపిస్తోంది.
Tags:    

Similar News