టాలీవుడ్ లో ముకుందాతో ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కోసం ఎన్నో నెలలు ఎదురు చూడాల్సిన వచ్చిన పూజా హెగ్డే ఇప్పుడు కోరుకున్న దాని కన్నా పెద్ద రేంజ్ లో ఉంది . అగ్ర హీరోల సరసన పోటీ పడి మరీ అవకాశాలు దక్కించుకుంటోంది. చైతుతో ఒక లైలా కోసం చేసి బాలీవుడ్ వెళ్ళిపోయాక ఇంత సాలిడ్ కం బ్యాక్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. అల్లు అర్జున్ డిజేలో ఎప్పుడైతే అందాల ఆరబోతకు తనకెలాంటి మొహమాటం లేదని బికినీ సీన్ తో ప్రూవ్ చేసాక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా అమ్మడికి ఆఫర్లు క్యు కట్టాయి.
పెద్ద హిట్ లేకపోవడాన్ని లోటుగా ఫీలవుతూ వచ్చిన ఈ బ్యూటీకి అది కూడా అరవింద సమేత వీర రాఘవ రూపంలో దొరికేసింది. ప్రస్తుతం మహేష్ బాబుతో మహర్షి ప్రభాస్ తో రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్న పూజా తాజాగా తన ఇన్స్ టాగ్రామ్ లో షేర్ చేసుకున్న ఫోటో వైరల్ అవుతోంది. హ్యారి పోటర్ తిరగాడిన ప్రపంచంలో గమ్మత్తైన మంచులో తడుస్తున్నాను అంటూ పూజా పెట్టిన ఫోటో చాలా క్యుట్ గా ఉంది. వైట్ టి షర్టుతో బ్లూ ప్యాంట్ కాంబినేషన్ లో సన్నని కరెంట్ తీగ అలా మంచు కురుస్తున్న రోడ్డులో నడుస్తుంటే ఎలా ఉంటుందో పూజా అచ్చం అలాగే ఉంది.
ఇది ఏ సందర్భమో అందులో ప్రస్తావించలేదు కాని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మోడల్స్ అందరూ బికినీల హాట్ ఫోజులతో రచ్చ చేస్తుంటే పూజా ఇలా వెరైటీగా నిండైన దుస్తుల్లో స్నోతో పోటీ పడుతున్న వైట్ బ్యూటీగా అలరించడం విశేషమే. పూజా లేటెస్ట్ హింది మూవీ హౌస్ ఫుల్ 4 షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. మహేష్ ప్రభాస్ ల సినిమాలు కాకుండా తెలుగులో పూజా ఇంకే కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్టు లేదు
Full View