ప్లాప్ నుంచి తెలివిగా ఎస్కేప్ అయిన పూజాహెగ్డే!

Update: 2022-12-31 06:01 GMT
బుట్ట‌బొమ్మ పూజాహెగ్డేని ఏడాదంతా బ్యాడ్ టైమ్ బంతాడేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది అమ్మ‌డు న‌టించిన  సినిమాల‌న్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. ఇటీవ‌లే రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా 'స‌ర్క‌స్' కూడా డిజాస్ట‌ర్ ఖాతాలో ప‌డింది. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయి అభిమానుల్ని నిరాశ‌ప‌రిచింది.

తాజాగా ఈ సినిమా వైఫ‌ల్యం తో  త‌న‌కెలాంటి సంబంధం లేన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంది పూజాహెగ్డే. అమ్మ‌డి మాట‌ల్ని బ‌ట్టి అలాగే అనుకోవాల‌ని నెటి జనులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఓసారి  పూజ మాట‌ల్ని ప‌రిశీలిస్తే..''ఈ సినిమా కేవ‌లం రోహిత్ శెట్టి కొస‌మే చేసాను.  అంద‌రిలాగే నాకు కొంద‌రి ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయాల‌ని ఉంటుంది. అలాంటి వాళ్ల‌లో రోహిత్ పేరు ముందుంటుంది.

ఆయ‌న ఫోన్ చేసి సినిమాలో న‌టించాల‌ని కోర‌గా మ‌రో మాట లేకుండా య‌స్ చెప్పేసాను.  ఆయ‌న కాల్ వ‌చ్చిన‌ప్పుడు ఇంట్లోనే ఉన్నా.  కానీ ఆ కాల్ అటెండ్ చేయ‌లేదు. అప్పుడు ఏదో ప‌నిలో  ఉన్నాను. అమ్మ అదే విష‌యం చెప్పి తిరిగి కాల్ చేయ‌మంది.దీంతో నేను చాలా  ఎగ్జైట్ మెంట్ తో చెప్పాను.ఆయ‌న గొంతు విన‌గానే కేక‌లు వేసిన‌ట్లుగా మాట్లాడాను ఆనందంతో.

ఆయ‌న డేట్స్ ఉన్నాయా? అని అడిగారు.  లేక‌పోతే స‌ర్దుబాటు చేసుకుంటాను స‌ర్ అని చెప్పాను. ముందు హీరో ఎవ‌రో అత‌ను చెప్ప‌లేదు . నేను అడ‌గ‌లేదు.

అత‌ని సినిమాలో న‌టించాల‌నుకున్న‌ప్పుడు హీరో తో ప‌నేముందు అన్న‌ది  నా ఉద్దేశం. అందుకే అడ‌గ‌లేదు. చివ‌ర్లో  హీరో ర‌ణ‌వీర్ సింగ్ అని చెప్పారు' అని అంది. పూజా మాట‌లు విన్న వారంతా స‌ర్క‌స్ ప్లాప్ ని మీద వేసుకోకుండా ఆ బాధ్య‌త అంతా ద‌ర్శ‌కుడి మీద‌కు తోసేస్తావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇప్ప‌టికే నెగిటివిటీ ఎక్కువైన నేప‌థ్యంలో  ఐరెన్ లెగ్ అనే ముద్ర వేస్తారు! అన్న‌భ‌యంతోనే పూజా ఇలా ప్లాప్ నుంచి ఎస్కేప్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తుందంటున్నారు.  ప్ర‌స్తుతం ఈ బ్యూటీ స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న 'కిసీకా భాయ్..కీసికా జాన్' లో న‌టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News