పూజా హెగ్డేని ఇన్నాళ్లు ముంబై గాళ్ అనే భావిస్తున్నారు. కానీ తన మూలాల్లోకి వెళితే అసలు గుట్టు తెలిసింది. అసలు ముంబైతో కానీ.. నార్త్ తో కానీ ఏ సంబంధం లేదట. పూజా కన్నడ గాళ్. పేరెంట్ వృత్తి రీత్యా ముంబైలో స్థిరపడింది అంతే. ఆర్థిక రాజధానిలో ఫ్యాషన్ ప్రపంచం పోకడలతో తొలి నుంచి అనుబంధం ఉంది కాబట్టి తనని ఓ కన్నడిగ అని భావించలేదు. అయితే తన రూపురేఖలు మాత్రం సౌత్ కి అవినాభావ సంబంధం కలిగి ఉండడం అభిమానుల్లో సందేహం రేకెత్తించింది. తెలుగులో నటిస్తే తెలుగమ్మాయే అంతగా కనెక్టయిపోయింది. అందుకే తనకు స్టార్ డమ్ అంతగా వెలిగిపోతోందిక్కడ.
ఎట్టకేలకు తాజా ఇంటర్వ్యూ లో తన నేటివిటీ గుట్టు కాస్తా విప్పేసింది పూజా. తనకు కన్నడ మూలాలున్నాయని ముంబైలో నివశించడం వల్లనే తనని ముంబై గాళ్ అని పిలుస్తారని తెలిపింది. పూజా కెరీర్ టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇటీవలే విడుదలైన అల వైకుంఠపురములో మరో క్రేజీ హిట్ గా నిలిచింది. కొత్త ఏడాదిని సక్సెస్ తో ప్రారంభించింది. అంతకు ముందు డీజే- మహర్షి - అరవింద సమేత విజయాలు అమ్మడికి ఎదురే లేని కెరీర్ ని ఇచ్చాయి. అటు బాలీవుడ్ లోనూ హౌస్ ఫుల్ -4 చిత్రంతో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన జాన్ లో నటిస్తోంది. ప్రస్తుతానికి తెలుగు లో పూజా కెరీర్ పీక్స్ ని ఎంజాయ్ చేస్తోంది.
దీంతో తెలుగు నేలపైనా.. తెలుగు భాషపైనా బాగానే కాన్సంట్రేట్ చేస్తోందిట. అరవింద సమంతే చిత్రానికి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇటీవల విడుదలైన అల వైకుంఠపురములో చిత్రానికి డబ్బింగ్ చెప్పి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తెలుగు నేర్చుకోవడానికి చాలా ఇష్టంతో కష్టపడాల్సి వస్తోందని తెలిపింది. అన్ని భాషలకన్నా తెలుగు కష్టంగా ఉంది. నేను తెలుగు మాట్లాడుతుంటే ముంబైలో ఉండే నా ఫ్యామిలీ.. స్నేహితులు తెలుగు అమ్మాయిలా చక్కగా మాట్లాడుతున్నావంటూ మెచ్చుకుంటున్నారు. ఆ ప్రశంస నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది . అల వైకుంఠపురములో నా పాత్రలో నటించినప్పుడు సన్నివేశానికి తగ్గట్టు డబ్బింగ్ పక్కాగా చెప్పగలిగాను. కానీ భాష మాత్రం చాలా కష్టంగా ఉంది అని వెల్లడించింది. అలాగే బన్నీ తో కెమిస్ట్రీ బాగుంటుందని...డిజే సినిమాలో కలిసి నటంచడంతో ఈ సినిమాలో నటించడం ఈజీ అయిందని తెలిపింది. కానీ ఇందులో బన్నీ తో కలిసి ఎక్కువగా డాన్సు చేసే అవకాశం రాలేదట. పూజా హెగ్దే పక్కాగా కన్నడ గాళ్. తల్లిదండ్రులు ముంబైలో స్థిర పడటంతో అక్కడే పెరిగింది.