ముంబై బ్యూటీ పూజా హెగ్డే జోరు గురించి చెప్పాల్సిన పనేలేదు. వరుసగా అరవింద సమేత వీర రాఘవ- మహర్షి లాంటి బ్లాక్ బస్టర్లలో నటించింది. ఇటీవలే గద్దలకొండ గణేష్ ఆశించిన ఫలితానివ్వకపోయినా తనకు కెరీర్ పరంగా ఢోకా ఏం లేదు. అప్పటికే స్టార్ హీరోలతో కమిట్ మెంట్లతో బిజీ బిజీ. బాలీవుడ్ లో హౌస్ ఫుల్ -4 మంచి విజయం సాధించింది. ఈ స్పీడ్ లోనే పూజా 2020 డైరీ కూడా ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరిలో రిలీజ్ కానుంది.
అల.. విజయంపై పూజా ఎంతో ధీమాగా ఉంది. అటు ప్రభాస్ సరసన జాన్ లోనూ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ పడినా జనవరి నుంచి శరవేగంగా పూర్తి చేస్తారట. వచ్చే ఏడాది జూలై తర్వాత రిలీజ్ చేయనున్నారు. ఇది పాన్ ఇండియా కేటగిరి అన్న ప్రచారం సాగుతోంది. దీంతో జాన్ కూడా పూజ కెరీర్ కి కలిసొచ్చేదే. ఇక బాలీవుడ్ లోనూ గట్టి ప్రయత్నాలు చేస్తోందని పూజా మాటలను బట్టి అర్థమవుతోంది.
బాలీవుడ్ లో ఈ అమ్మడి కెరీర్ జోరుగానే ఉంది. ఇటీవలే హౌస్ ఫుల్ -4 సక్సెస్ ఇచ్చిన కిక్కుతో రెట్టించిన ఉత్సాహంతో అదే నిర్మాణ సంస్థలో మరో సినిమాకు కమిటైంది. అలాగే మరో పెద్ద ప్రాజెక్ట్ కి ఈ సోయగం సంతకం చేసిందట. ఇదిలా ఉండగానే టాలీవుడ్ లో మరో రెండు పెద్ద సినిమాలకు సంబంధించిన చర్చలు జరుపుతోందట. నేడో రేపో అవి కూడా లాక్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి పూజా కొత్త సంవత్సరం డైరీ హౌస్ ఫుల్ అని క్లియర్ కట్ గా అర్థమవుతోంది.