కెరీర్ ఆరంభంలోనే గ్రేట్ డ్యాన్సర్స్ తో పని చేశా!

Update: 2020-01-15 17:30 GMT
తెలుగులో ఇప్పుడున్న హీరోయిన్లలో స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ ఎవరు అంటే వెంటనే పూజ హెగ్డే పేరు చెప్పాల్సి ఉంటుంది.  ఇప్పటి వరకూ పెద్ద స్టార్ హీరోల సినిమాలలో అవకాశం వచ్చింది కానీ ఏ ఒక్కటి సాలిడ్ హిట్ అనిపించుకోలేదు. అయితే ఈసారి సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో' మాత్రం పూజకు ఆ లోటు తీర్చేలా ఉంది. సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.  తాజాగా 'అల వైకుంఠపురములో' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పూజ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

అల్లు అర్జున్ తో డ్యాన్స్ ఎలా అనిపించింది అని అడిగితే.. కెరీర్ ఆరంభంలోనే హృతిక్ రోషన్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లాంటి గ్రేట్ డ్యాన్సర్లతో పని చేయడంవల్ల డ్యాన్స్ అలవాటు అయిపోయిందని..  ఈ సినిమాలో  ఈ సినిమాలు తనకు సింపుల్ స్టెప్స్ ఉనడడంతో పెద్దగా కష్టం అనిపించలేదని చెప్పింది.  ఈ సినిమాలో బన్నీని మ్యాచ్ చేసేలా డ్యాన్స్ చేశానని అనుకుంటున్నానంది. ఈ సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి అని ప్రశ్నిస్తే బుట్టబొమ్మ పాటకు ముందుగా వచ్చే లీడ్ సీన్ ఇష్టమని.. అలాగే బోర్డ్ రూమ్ సీన్ కూడా బాగుంటుందని బదులిచ్చింది.  ఈ రెండు సీన్లు సరదాగా ఉంటాయని చెప్పింది.  ఇవి కాకుండా మరో సీన్ కూడా తనకు ఇష్టమని.. అయితే ఆ సీన్ కట్ చేశారని త్వరలో దాన్ని కూడా త్వరలో కలుపుతారని ఆశ పడుతున్నట్టు  చెప్పింది.

మీరు బన్నీకి ఫ్యాన్ అని చెప్పారు కదా అని అడిగితే "అవును. నేను బన్నీ ఫ్యాన్ నే. తనతో పని చేయడం ఎంజాయ్ చేస్తాను. ప్రభాస్ తో కూడా అదే ఫీలింగ్ ఉంటుంది" అని చెప్పింది.  ఇక బాలీవుడ్ లో చేయబోయే మరో ప్రాజెక్టు గురించి కూడా ఒక హింట్ ఇచ్చింది.  హృతిక్ రోషన్ నెక్స్ట్ ఫిలిం లో నటిస్తున్నానని తెలిపింది.


Tags:    

Similar News