పూజమ్మా-వాటీజ్ దిస్సమ్మా

Update: 2018-03-09 11:33 GMT
డిజే దువ్వాడ జగన్నాధం సినిమా వల్ల ఎవరు లాభపడ్డారో ర్యాంక్ ల ప్రకారం చెప్పమంటే అల్లు అర్జున్ కంటే ముందు హీరొయిన్ పూజా హెగ్డే పేరే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా చరిత్ర సృష్టించేంత విజయం సాధించకపోయినా అందులో పూజా బికినీ అందాలకు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. తను గతంలో ముకుందా, ఒక లైలా కోసం సినిమాల్లో నటించినా వాటి వల్ల రాని గుర్తింపు పేరు అమాంతం ఒక్కసారిగా డిజే వల్ల వచ్చి పడ్డాయి. ఇప్పుడు తన రేంజ్ మామూలుగా లేదు. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం ఒక ఎత్తైతే మహేష్ బాబు-వంశీ పైడిపల్లి మూవీలో కూడా తనే సెలెక్ట్ కావడం పూజాను మబ్బుల్లో నిలబెడుతోంది. పూజాకున్న అతి పెద్ద ప్లస్ పాయింట్ తన బాడీ ఫిగర్.

అందం అనే పదార్థాన్ని ముద్దగా తీసుకుని ఎక్కడ ఏ భాగం ఎలా అమర్చాలో చాలా పద్దతిగా శ్రద్ధగా తీర్చిదిద్దినట్టు ఉండే పూజా శరీరంలోని ఒంపుల గురించి మాటల్లో చెప్పడం అంత సులభం కాదు. అందుకే తన బలమైన బాడీ ఫిట్నెస్ ని నిర్లక్ష్యం చేయకుండా పూజా రెగ్యులర్ జిమ్ సెషన్స్ అటెండ్ అవుతోంది. ప్రత్యేకంగా త్రివిక్రమ్ చేయమని చెప్పాడో లేక పూజా తనే వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటుందో కాని పైన నల్లని ట్రాక్ సూట్ లో జిమ్ నుంచి బయటికి వస్తున్న పూజా ను చూస్తుంటే అభిమానులు మాత్రమే కాదు మగ పుంగవులందరూ తనకు ఫిదా అయ్యేలా ఉన్నారు. ఈ మధ్యే జిగేల్ జిగేల్ రాణి అంటూ రంగస్థలంలో ఒక ఐటెం సాంగ్ చేసిన పూజా హెగ్డే ఒకే ఏడాది ముగ్గురు క్రేజీ స్టార్ హీరోస్ సరసన కనిపించే ఛాన్స్ కొట్టేసింది.

డిజే తర్వాత పూజా హెగ్డే చేసిన సాక్ష్యం సినిమా మే విడుదలకు సిద్ధమవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఆ మూవీ కోసం పూజా కోటికి పైగానే పుచ్చుకున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. డిమాండ్ ఉన్నప్పుడు ఆ మాత్రం తీసుకోవడం తప్పు కాదు లేండి. మహేష్, తారక్ తర్వాత చేయబోయే సినిమాలు ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.
Tags:    

Similar News