కథానాయికలు సొంత గొంతుని వినిపించేందుకు పోటీపడుతున్నారు. ఇదివరకు అరువు గొంతులపైనే ఆధారపడిన భామలంతా ఇప్పుడు ఉత్సాహంగా తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకొనేందుకు ముందుకు వస్తున్నారు. ఆ జాబితాలో పూజాహెగ్డే కూడా చేరింది. ఆమె ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న `అరవింద సమేత`లో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం పూజా సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటోంది. తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటున్నానోచ్ అంటూ సంబరపడుతోంది పూజా.
ఆమె కన్నడ అమ్మాయి. దాంతో తెలుగుపై త్వరగానే పట్టు పెంచుకుంది. అందుకే త్రివిక్రమ్ డబ్బింగ్ చెప్పమని కోరాడట. అందుకు ఓకే అనేసిన పూజా రికార్డింగ్ థియేటర్లోకి అడుగుపెట్టింది. త్రివిక్రమ్ సినిమాల్లో ఈమధ్య నటిస్తున్న కథానాయికలంతా కూడా సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. `అజ్ఞాతవాసి`లో నటించిన అను ఇమ్మాన్యుయేల్ - కీర్తి సురేష్ సొంత గొంతులే వినిపించారు. ఇప్పుడు పూజ వంతు వచ్చింది. దసరాకి రిలీజ్ కానున్న `అరవింద సమేత` సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు అప్పుడు జోరందుకున్నట్టు తెలుస్తోంది.