'రాధేశ్యామ్‌' కోసం పూజా సెంచరి కొట్టనుందా?

Update: 2020-12-15 11:32 GMT
ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న రాధేశ్యామ్‌ షూటింగ్‌ దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సాహో సినిమా విడుదలకు ముందే ఒక షెడ్యూల్‌ ను పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా వరుసగా షూటింగ్ షూటింగ్‌ అంటూ చేస్తూనే ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిదానంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం పూజా హెగ్డే ఇప్పటి వరకు 87 రోజుల పాటు షూటింగ్‌ లో పాల్గొందట. హీరోయిన్‌ 87 రోజుల పాటు షూటింగ్‌ లో పాల్గొన్నది అంటే హీరో ఇంకా ఎన్ని రోజులు వర్క్‌ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినట్లుగా అనిపించడం లేదు. మరో నెల రోజులు లేదా ఈ నెల చివరి వరకు అయినా షూటింగ్‌ చేసే అవకాశం ఉంది. ఈ నెల చివరకు వరకు లేదా వచ్చే నెలలో కూడా షూటింగ్‌ చేస్తే పూజా హెగ్డే హాజరు అయితే సెంచరీ కొట్టడం ఖాయంగా అనిపిస్తుంది. ఒక హీరోయిన్‌ ఒకే సినిమా కోసం వంద రోజులు పని చేయడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. రాజమౌళి వంటి భారీ చిత్రాల దర్శకులు మాత్రమే హీరోయిన్స్‌ తో అన్ని రోజులు పని చేయించుకుంటారు. ఇప్పుడు రాధేశ్యామ్ కోసం వంద రోజులు పూజా హెగ్డే వర్క్‌ చేస్తే ఈ సినిమాలో ఆమె పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News