రాణి గారితో `స్పెష‌ల్ హీరోయిన్ సాంగ్` అనాలేమో!

Update: 2021-03-04 04:30 GMT
ఐటెమ్ సాంగ్ వేరు.. `స్పెష‌ల్ క‌థానాయిక సాంగ్` వేరే క‌ద‌మ్మా! అంటూ యాంక‌ర్ కం న‌టి అన‌సూయ చెప్పిన‌ట్టు.. ఇప్పుడు `ఆచార్య`‌లో పూజా హెగ్డేపై పాట‌ను కూడా ఏదైనా `స్పెష‌ల్ హీరోయిన్ సాంగ్` అనాలేమో! ఈగో సంతృప్తి చెంద‌క‌పోతే ఇంకేదైనా స్పెష‌ల్ నేమ్ తెర‌పైకొస్తుందేమో!!

ప్ర‌స్తుతం ఆచార్య కోసం రామ్ చరణ్ - పూజా హెగ్డేపై ఒక ప్ర‌త్యేక పాట‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇంత‌కుముందు రంగ‌స్థ‌లంలో జిగేల్ రాణీగా ద‌ర్శ‌న‌మిచ్చిన పూజాతో అలాంటి ఐటెమ్ నంబ‌ర్ మ‌ళ్లీ గ‌ట్టిగానే ప్లాన్ చేశార‌ని అభిమానులంతా భావించారు. కానీ అది వేరే.. ఇది వేరే! అని తాజాగా లీకులు అందాయి.

ఇది పూర్తిగా స‌ప‌రేట్ సాంగ్. ఇంకా చెప్పాలంటే కేవ‌లం మాంటేజ్ సాంగ్ అని చెప్పాలి. పూజా కేవ‌లం చెర్రీ ఊహ‌ల్లోని మాంటేజెస్ లో మాత్రం క‌నిపిస్తుంది. జిగేల్ రాణీలా గుభేల్మ‌నిపించే స్టెప్పులు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. మాంటేజ్ పాటలు సాధారణంగా కథనాన్ని డ్రైవ్ చేస్తుంటాయి. కథ జరుగుతున్నట్లు కొంత భాగాన్ని మాత్ర‌మే చెబుతాయి. కాబట్టి ఈ పాట సినిమాలో చాలా కీలకం కానుంది. దీనిని బ‌ట్టి అభిమానులు బుట్ట బొమ్మ నుంచి జిగేల్మ‌నిపించే గుండె గుభేల్మ‌నిపించే బాడీ లాంగ్వేజ్ ని ఆశించ‌న‌క్క‌ర్లేద‌న్న‌మాట‌. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాల‌తో బిజీగా ఉన్న పూజా ఇలా స్పెష‌ల్ మాంటేజ్ క‌థానాయిక సాంగ్ కి అంగీకరించ‌డం మెచ్చ‌ద‌గిన‌దే.
Tags:    

Similar News