చైత‌న్య స‌ర‌స‌న పాన్ ఇండియా బ్యూటీ!

Update: 2022-02-17 07:30 GMT
యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ల‌వ్ స్టోరీ`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న చైత‌న్య `బంగార్రాజు`తో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కోవిడ్ స‌మ‌యంలో రెండు విజ‌యాలు అందుకున్న ఒకే ఒక్క హీరోగా చైత‌న్య‌ని చెప్పొచ్చు.

రెండు సినిమాలు థియేట‌ర్లో రిలీజ్ అయి స‌క్సెస్ అవ్వ‌డం పెద్ద విశేషంగానే భావించాలి. ప్ర‌స్తుతం చైత‌న్య విక్ర‌మ్. కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `థాంక్యూ `లో న‌టిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ జాన‌ర్ చిత్రాన్ని అన్ని ప‌నులు పూర్తిచేసి ఇదే ఏడాది రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండగానే చైత‌న్య కొత్త స్ర్కిప్ట్ లు వింటూ న‌చ్చిన క‌థ‌ల్ని లాక్ చేస్తున్నారు.

తాజాగా కోలీవుడ్ స్టార్ మేక‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌డానికి చై గ్నీన్ సిగ్నెల్  ఇచ్చిన‌ట్లు త తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇందులో పూజాహెగ్డేని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు స‌మాచారం.

 ఆ పాత్ర‌కు పూజా బ్యూటీ అయితేనే  పక్కాగా యాప్ట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు భావించి ఆమెను ఎంపిక చేస్తున్న‌ట్లు గుస‌గుస విన‌పిస్తోంది. అదే గ‌నుక నిజ‌మైతే చైత‌న్య‌తో పూజా హెగ్డే జ‌త క‌ట్ట‌డం రెండ‌వ‌సారి అవుతుంది. కెరీర్ ఆరంభంలో పూజాహెగ్డే  చైత‌న్య‌తో  క‌లిసి `ఒక‌లైలా కోసం`లో న‌టించింది. రొమాటిక్ ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో  తెర‌కెక్కిన ఆ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్  అయినా వాటిని  అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.

అలా ఆ కాంబినేష‌న్ పై నెగిటివ్ ఇమేజ్ ప‌డింది.  కానీ కోలీవుడ్ మేక‌ర్ అలాంటి సెంటిమెంట్ ల‌కు తావు ఇవ్వ‌కుండా తాను రాసుకున్న పాత్ర‌కు పూజా అయితేనే బాగా యాప్ట్ అవుతుంద‌ని భావించి ఆమెను ఎంపిక చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పూజా హెగ్డే   హీరోయిన్ గా ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఐదు సినిమాలు చేతిలో ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే  మెగాస్టార్   చిరంజీవి స‌ర‌స‌న‌`ఆచార్య` లోనూ న‌టించింది.

కోలీవుడ్ లో  విజ‌య్ స‌ర‌స‌న `బీస్ట్ లో`..హిందీలో `సిర్క‌స్` లోనూ న‌టిస్తోంది. ఇటీవ‌లే మ‌హ‌ష్ -త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ లోనూ ఎంపికైంది.  `మ‌హ‌ర్షి` త‌ర్వాత  రెండ‌వ‌సారి మ‌హేష్ తో న‌టించే ఛాన్స్ అందుకుంది. ఇంత బిజీగా ఉన్న పూజాని చైత‌న్య స‌ర‌స‌న లాక్ చేయ‌డానికి భారీగానే పారితోషికం ఆఫ‌ర్ చేసి ఉంటారు. ఇప్ప‌టికే రెమ్యున‌రేష‌న్ లో బ్యూటీ డిమాండ్ స్కైని ట‌చ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News