అందివచ్చిన అదృష్టాన్ని హీరొయిన్ పూజా హెగ్డే చాలా తెలివిగా వాడుకుంటోంది. అల్లు అర్జున్ తో చేసిన డిజే కమర్షియల్ గా పర్వాలేదు అనిపించినా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాలేకపోయింది. కాని అందులో బికినీతో రచ్చ రచ్చస్య చేసిన పూజా హెగ్డే మాత్రం అందరిని ఫిదా చేసేసింది. ఇంకేముంది తన ట్రాక్ రికార్డ్ పట్టించుకోకుండా భారీ ఆఫర్లతో తన ముందు క్యు కట్టేసారు నిర్మాతలు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం సినిమా చేస్తున్న పూజా ఇటీవలే రామ్ చరణ్ తో రంగస్థలం ఐటెం సాంగ్ కోసం స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. ఇక రానున్న వాటిలో మహేష్ బాబు-వంశీ పైడిపల్లి మూవీ ఇప్పటికే కన్ఫర్మ్ కాగా జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కూడా తన ఖాతాలోకే వేసుకుంది.
మీరు పైన చూస్తున్న పిక్ పూజా హెగ్డే జిమ్ లో కష్టపడి వర్క్ అవుట్ చేస్తున్నది. సన్నగా నాజుగ్గా ఒంట్లో కండ ఏ భాగంలో ఏది ఎంత ఉండాలో అంతే కరెక్ట్ గా తూచినట్టు మైంటైన్ చేస్తున్న పూజా అది కాపాడుకోవడం కోసం బాగానే కష్టపడుతోంది. ఈ పిక్ ని తన సోషల్ మీడియా ఎకౌంటు లో షేర్ చేసుకున్న పూజా దానితో పాటు ఒక మెసేజ్ కూడా పెట్టింది. ఏకాగ్రత, సమతూల్యత తన బలమని చెప్పిన పూజా ఇక్కడ తాను చేసింది చూసినంత తేలిక కాదని హింట్ ఇచ్చేసింది. ఎముకల పటుత్వం కోసం ఇవి చేస్తున్నట్టు పేర్కొన్న పూజా ఇది ఎక్కడో మాత్రం చెప్పలేదు.
ఇలా హీరొయిన్లను స్పూర్తిగా తీసుకునైనా యువత బాడీ ఫిట్నెస్ పై దృష్టి సారిస్తే మంచిదేమో. ఆరోగ్యంతో పాటు జబ్బులు రాకుండా చక్కని జీవితాన్ని గడపడానికి ఇలాంటి జిమ్ ఎక్సర్ సైజులు చక్కగా ఉపయోగపడతాయి. పూజా హెగ్డే ని ఇలా చూసిన వాళ్ళు అది నేర్చుకుంటారో లేక తన ఓంపుల్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తారో వాళ్ళకే వదిలేయాలి. మే మూడో వారంలో సాక్ష్యం విడుదలయ్యే అవకాశం ఉంది.
Full View