క్యాస్టింగ్ కౌచ్ అనేది ఈమధ్య మొదలయిన విషయం కాదు. కానీ ఈమధ్య బాగా వెలుగులోకొచ్చిన విషయం. హాలీవుడ్ లో హర్వీ ఎపిసోడ్ తర్వాత ప్రపంచంలోని ఫిలిం సెలెబ్రిటీ లంతా ఈ జాడ్యంపై తమ గళమెత్తుతున్నారు. కొంతమందేమో తమకు జరిగిన బాధాకర సంఘటనలను మీడియాతో పంచుకుంటున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలనుండి సౌత్ యాక్టర్ల వరకూ దీనిమీద ఇప్పటికే చాలామంది స్పందించారు.
తాజాగా ఈ టాపిక్ పై 'విశ్వరూపం'.. 'ఉత్తమ విలన్'.. 'PSV గరుడ వేగ' లాంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ పూజా కుమార్ మాట్లాడింది. తనకు ఇంతవరకూ క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదురుకాలేదని కానీ ఈ విషయం పై గళమెత్తడం చాలా ముఖ్యమని చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది వేరే ఎవరికీ జరగకుండా చేయాలని చెప్పింది. మరోవైపు ఎవరైనా సక్సెస్ కోసం ఇలాంటి డిమాండ్స్ ను ఒప్పుకోవాల్సిన అవసరం లేదని, హార్డ్ వర్క్ తో తమ కెరీర్ లో సక్సెస్ సాధించవచ్చని - లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపింది.
ఎవరైతే క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు తమకెదురైన ఇబ్బందులను బయటకు చెప్పాలని, దీని వల్ల సొసైటీ కి అసలేం జరుగుతుందో తెలుస్తుందని.. ఇండస్ట్రీ కి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ని మెరుగుపరిచే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పింది.