డ్రగ్స్ రాకెట్ దర్యాప్తు తర్వాత బాలీవుడ్ ని అట్టుడికిస్తున్న సంచలన కేసుగా రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ కేసులో రకరకాల పేర్లు బయటపడుతున్నాయి. అందులో పలువురు శృంగార నాయికలు ఉండడం గుబులు రేపుతోంది. రాజ్ కుంద్రా కేసులో ఆధారాలు స్పష్టంగా కనబడుతున్నందున ముంబై పోలీసులు ఈ కేసును వేగంగా విచారిస్తున్నారు. శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా నివాసంలో ఇటీవల దాడి చేసి సుమారు డెబ్బై పోర్న్ వీడియోలను స్వాధీనం చేసుకున్నారని కథనాలొచ్చాయి.
ఈ కేసును లోతుగా విచారిస్తుంటే కొంతమంది నటీమణుల గురించిన నగ్నసత్యాలు బయటపడుతున్నాయని తెలిసింది. పలువురు కథానాయికలు ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన వెల్లడించడానికి ముందుకు వచ్చారు. పూనమ్ పాండే వారిలో ఒకరు. వాస్తవానికి పూనమ్ 2019లో ఓసారి రాజ్ కుంద్రా వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కేసును మాఫీ చేసారు. మేనేజ్ చేశారు.
ఇప్పుడు రాజ్ కుంద్రా అరెస్టు నేపథ్యంలో పూనమ్ మరోసారి తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేసారు. తాను 2019 లో కేసు నమోదు చేశానని ఎవరూ తన మాట వినలేదని.. కనీస మద్దతు ఇవ్వలేదని.. కానీ ఇప్పుడు చాలా మంది నటీమణులు సహాయం కోసం ముందుకు వస్తున్నారని పూనం చెప్పారు. రాజ్ కుంద్రా అతని బృందంపై 2019 లో దాఖలు చేసిన కోర్టు కేసు గురించి అందరూ అడుగుతున్నారని నటి తెలిపింది. ఒప్పందంపై సంతకం చేయమని కుంద్రా టీమ్ ఆమెను కోరగా ఆమె నిరాకరించగా.. వ్యక్తిగత మొబైల్ నంబర్ ని లీక్ చేస్తామని బెదిరించారని పూనమ్ చెప్పారు.
వాళ్లు నా వ్యక్తిగత ఫోన్ నంబర్ లీక్ చేసారు. ఇది ఏ అమ్మాయికి జరగకూడనిది. నేను పరారీలో ఉన్నాను. యాసిడ్ దాడితో సహా నాకు చాలా బెదిరింపుల మెసేజ్ లు పెట్టారు. ఆ తర్వాత ఆమె కేసు వేసినప్పుడు ఎవరూ తనను సమర్థించలేదని పూనమ్ గుర్తు చేసుకుంది.
ఆ కేసు ఇంకా కోర్టులో ఉంది. ఈ కేసు విషయంలో చర్యలు తీసుకుంటే చాలా మంది బాలికలను దోపిడీ నుండి కాపాడిన వారమవుతామని నమ్ముతోంది. ఏ అమ్మాయి అయినా తాను అనుభవించిన బాధలను ఆవేదనను అనుభవించకూడదని ఆమె అన్నారు. మౌనంగా బాధపడుతున్న వారు బయటకు వచ్చి స్వరం పెంచాలని పూనమ్ కోరారు. రెండేళ్ల క్రితం నా నంబర్ లీక్ అయినప్పుడు నేను దాఖలు చేసిన కోర్టు కేసులో నన్ను చాలా వేధించారు. నా ప్రైవేట్ విషయాలు చాలా లీక్ అయ్యాయి.. అని పూనమ్ నివేదించారు. ఇదిలావుండగా.. ముంబై కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న రాజ్ కుంద్రాను మరోసారి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కుంద్రా కేసును చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తుండడం బాలీవుడ్ లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక ఈ కేసులో పలువురు కథానాయికల పేర్లు రివీలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పోలీసులు గోప్యతను పాటిస్తారు.
పూనమ్ పాండే గత వివాదం మరువలేరు:
మరో కోణంలో చూస్తే అప్పట్లో పూనమ్ పై రకరకాల వివాదాలు సంచలనంగా మారాయి. ఇంతకుముందు కెనకోనా జిల్లాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించినందుకు పూనమ్ పాండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలాంగూట్ పోలీసు బృందం పాండేను అదుపులోకి తీసుకుని తరువాత ఆమెను ప్రశ్నించడానికి కెనకోనా పోలీసులకు అప్పగించగా.. అనంతరం పోలీసుల సుదీర్ఘ ఇంటరాగేషన్ కొనసాగింది. ఈ కేసులో పూనమ్ టీమ్ కి అనుమతించినందుకు ఇన్స్ పెక్టర్ సహా ఇద్దరు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు.
డ్యామ్ వద్ద వివాదాస్పద వీడియోను చిత్రీకరించడానికి సదరు శృంగార తారకు అనుమతి ఇచ్చినందున పోలీసులు కొంతవరకు తప్పుదోవ పట్టించారని కథనాలొచ్చాయి. వివాదాస్పద ఫోటోషూట్ కు సంబంధించి ఆమెపై దాదాపు అరడజను రాతపూర్వక ఫిర్యాదులు అందగా పోలీసులు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 (అశ్లీలత) కింద పాండేపై కేసు నమోదు చేశారు. చపోలి ఆనకట్టను నిర్వహించే రాష్ట్ర జల వనరుల శాఖ ఫిర్యాదులలో ఒక ఫిర్యాదు నమోదైంది. పూనమ్ పాండే వీడియో గోవాలో రాజకీయ తుఫానుకు దారితీసింది. ఈ సంఘటన రాష్ట్రంలో పొలిటికల్ టర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్..., జల వనరుల మంత్రి ఫిలిపే నెరి రోడ్రిగ్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు వైస్ ప్రెసిడెంట్ .. ప్రతినిధి గోవా ఫార్వర్డ్ పార్టీ దుర్గాదాస్ కామత్ నినదించారు. పూనమ్ నగ్న వీడియో కి సంబంధించిన లీకులు అంతర్జాలాన్ని షేక్ చేసాయి.