పూనమ్ కౌర్.. 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 'ఒక విచిత్రం' 'గగనం' 'శౌర్యం' 'నాగవల్లి' 'అటాక్' 'శ్రీనివాస కళ్యాణం' సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి 'స్వర్ణ ఖడ్గం' అనే సీరియల్ లో యాక్ట్ చేసింది. తెలుగుతో పాటు కన్నడ తమిళ భాషల్లో సినిమాలు కూడా చేసింది. అయితే పూనమ్ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు అవుతున్నా తన సినిమాల కంటే పలు వివాదాలతోనే బాగా పాపులర్ అయ్యింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధం లేని అంశాలపై స్పందిస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడో దూరమైన ఈ అమ్మడు తరచూ ఇక్కడి నుండి వదిలి పోవడం లేదంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి.
అంతేకాకుండా అమ్మడు డిఫరెంట్ మీనింగ్ వచ్చేలా ట్వీట్లు చేస్తుండటంతో ఎవర్ని ఉద్దేశించి చేస్తుంది.. ఎందుకు చేస్తుంది అని అందరూ చర్చించుకునేలా చేస్తుంది. అయితే అమ్మడికి సినిమా అవకాశాలు లేకపోవడం వల్లనే మీడియా అటెన్షన్ కోసం ఏదొక కాంట్రవర్సియల్ ఇష్యూ లో వేలు పెడుతూ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇటీవల లాక్ డౌన్ వలన అందరూ గుముగూడుతారని నందమూరి వారసులు సైతం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇంట్లోనే నివాళులు అర్పిస్తే పూనమ్ మాత్రం ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పించి వార్తల్లోకి ఎక్కింది. అప్పుడు కూడా అందరూ పూనమ్ అటెన్షన్ కోరుకునే అలా చేసిందని కామెంట్స్ చేసారు. ఆ తర్వాత పీకే లవ్స్ మాస్క్ ధరించడం పై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ పై ఇండైరెక్టు గా రియాక్ట్ అయి ఆ ఇష్యూని పెద్దది చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ తనకు సంభంధం లేని విషయంపై స్పందించి మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొన్నిరోజులుగా సినీ పరిశ్రమలో హీరోయిన్ మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మీరాచోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఇష్యూ పై టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎవరూ స్పందించలేదు. అయితే ఈ ఇష్యూ ని ఉద్దేశించి పూనమ్ కౌర్ పెట్టిన కొన్ని ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ''సినీ యాక్టర్స్ జీవితంలో ట్రోలింగ్ కూడా భాగమని, వాటిని పట్టించుకోకూడదని.. అభిమానులు అమాయకులని.. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వ్యక్తులు వాళ్లని ప్రేరేపిస్తున్నారని'' ట్వీట్ చేసింది. అంతేకాకుండా కారణం లేకుండా చాలా మంది నా గురించి తప్పుగా ప్రచారం చేశారని.. అసభ్యంగా మాట్లాడారని.. కానీ ఇప్పటివరకూ నేను ఏ ఒక్క అభిమానిపై ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది.
ఫ్యాన్స్ అమాయకులని నమ్ముతాను.. కొంతమంది మధ్యవర్తులు తమ స్వలాభం కోసం అభిమానులను ఇలాంటి విషయాల్లో ప్రేరేపిస్తున్నారు.. అందుకే నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తులపై మాత్రమే నేను ఫిర్యాదు చేశాను అని చెప్పింది. 'ఏ హీరో కూడా తన ఫ్యాన్స్ వేరే వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించాలని కోరుకోడు. సినీ తారల జీవితంలో ట్రోలింగ్ ఒక భాగం. నిన్ను బాధితురాలిగా మార్చేందుకే ట్రోలింగ్ చేస్తారు. వాటిని వదిలేసి మనం ప్రయాణం సాగించాలి' అని చెప్పుకొచ్చింది పూనమ్. అంతేకాకుండా ''రాజకీయ లబ్ధి కోసమే ఓ నటుడిపై బురద జల్లడం కోసం ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారేమో మనకి తెలియదు. మన ఇండస్ట్రీ రాజకీయ పార్టీలతో లింకై ఉందని గ్రహించాలి. ఫ్యాన్స్ అమాయకులు. కొంతమంది రాజకీయ నేతలు రాక్షసులు. అలాంటి వాళ్లే ఇలాంటివి చేస్తారు'' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్స్ పై కూడా నెటిజన్స్ భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ కౌర్ ప్రస్తుతం ఏ ఇష్యూ అయితే హాట్ టాపిక్ గా ఉంటుందో అది తనకు సంబంధించింది కాకపోయినా వేలు పెడుతూ ఉంటుంది.. ఇప్పుడు ఈ ఇష్యూ పై కూడా అలానే రియాక్ట్ అయింది అని కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాలకి సినీ ఇండస్ట్రీకి లింక్ పెడుతూ కావాలనే ఈ ఇష్యూని పెద్దది చేయాలని చూస్తోందని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.