నటిగా పూనమ్ కౌర్ కెరీర్ గురించి తెలిసినదే. అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలొచ్చినా నిలబెట్టుకోవడంలో తడబడింది. చిన్నా చితకా సినిమాల్లో నటించినా అవేవీ సరిగా హిట్టవ్వలేదు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో వివాదాస్పద ఎపిసోడ్ లో పూనమ్ కౌర్ పేరు వినిపించడం తనకు కెరీర్ పరంగా మైనస్ అయ్యింది. రకరకాల వివాదాల గురించి తెలిసినదే.
ఇకపోతే తన కెరీర్ ని రావణులు చెడగొట్టారని పూనమ్ కౌర్ తాజాగా ఆరోపించారు. అయినా తాను సీత.. ద్రౌపది వంటి మహాసాధ్విల స్ఫూర్తితో నిలదొక్కుకుంటానని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు తన జీవితాన్ని నాశనం చేశారని కూడా ఆవేదన చెందారు. మిడిల్ క్లాస్ యువతి అయిన తన పెళ్లి కలను కూడా చెదరగొట్టారని కలతను వ్యక్తం చేసారు పూనమ్.
మూడేళ్లుగా వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసానని కూడా పూనమ్ అన్నారు. పెద్ద చిత్రాల్లో అవకాశాలొచ్చినా కొందరు రావణులు చెడగొట్టారని పూనమ్ తీవ్రంగా ఆరోపించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ కామెంట్లపై చర్చ సాగుతోంది. తనని నాశనం చేసిన రావణుడు ఎవరు? అన్నదానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.
వినాయకుడు లాంటి హిట్ చిత్రంతో కథానాయికగా కెరీర్ ప్రారంభించి 20 పైగా చిత్రాల్లో నాయికగా అవకాశాలు అందుకుంది పూనమ్. ఇటీవల సినిమా అవకాశాలు తగ్గాయి. అప్పట్లో బాహుబలి నిర్మాతలు తెరకెక్కిస్తున్న టీవీ సిరీస్ లో నటించినా కానీ అవేవీ కలిసి రాలేదు.