హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా తనకు జరిగిన అన్యాయం జరిగిందని ఓ స్టార్ డైరెక్టర్ పై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె డిప్రెషన్ కి లోనవడానికి ఆ డైరెక్టర్ ఎలా కారకుడయ్యాడని వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. ''పూనమ్ పరిస్థితి బాగోలేదని.. ఇలాంటి పరిస్థితిలో మీరు ఆమెకు అండగా ఉండాలని నా ఫ్రెండ్ ఒకరు ఒక డైరెక్టర్ ను కలిశారు. ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు కలిశారు. మాయ మాటలు చెబుతూ తప్పించుకున్నాడు. ఆ తరవాత నా పరిస్థితిని మార్చగలరా అని నేనే నేరుగా ఆయన్ని అడిగాను. నాకు అనారోగ్యంగా ఉందని.. సూసైడ్ చేసుకోవాలి అనిపిస్తోందని చెప్పాను. అప్పుడు ఆ డైరెక్టర్ ''నువ్వు చచ్చిపోతే ఒక్క రోజు న్యూస్ లో ఉంటావ్'' అన్నాడు. మీడియాను అతను నియంత్రించాడు. మూవీ మాఫియాను కూడా నియంత్రించాడు. నా ప్రకటనలను అతనే నియంత్రించాడు. పరోక్షంగా నా మీద ఆన్ లైన్ లో ఆర్టికల్స్ రాయించి నన్ను మరింత డిప్రెషన్ లోకి నెట్టేశాడు. అనవసరపు వార్తలు నన్ను మరింత కుంగదీశాయి. సినిమా క్యాస్టింగ్ నుంచి నా పేరును తీసేశావ్. ఆడియో ఫంక్షన్ నుంచి నా ఫొటోస్ తొలగించావ్. నువ్వు చేసింది ఇప్పటికీ నాకు గుర్తుంది అంటూ ఆవేదనగా ట్వీట్స్ చేసింది.
అంతేకాకుండా ఆ స్టార్ డైరెక్టర్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరోని అతన్ని ఎంతో ప్రేమించే భార్యను కలవకుండా ఆపేశావ్.. కానీ వారి మధ్యలో నువ్వు వచ్చినందుకు ఈ రోజు ఆ స్టార్ ఎన్నో అవమానాలకు గురి కావాల్సి వస్తోంది. పిల్లలు బాధపడ్డారు.. అతను బాధపడ్డాడు.. ఇంకా బాధపడుతూనే ఉన్నాడు.. ఇదంతా ఎందుకు చేశావ్.. స్లో పాయిజన్ లా అతడ్ని చంపాలనుకుంటున్నావా.. అని పూనమ్ ట్వీట్ చేసింది. పూనమ్ ట్వీట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరంటూ నెటిజన్స్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసారు. అయితే ఒక ప్రముఖ ప్రసార మాధ్యమం మాత్రం పూనమ్ పేరు చెప్పకపోయినా డైరెక్టర్ త్రివిక్రమ్ ని ఉద్దేశించే ట్వీట్స్ చేసిందంటూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. పూనమ్ మీడియా అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తోందని.. త్రివిక్రమ్ వలన పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారనడంలో అర్థం లేదు. విడిపోయి వారిద్దరూ ఎవరి జీవితాన్ని వారు హ్యాపీగా గడుపుతున్నారు.. పూనమ్ ఇలాంటి ట్వీట్స్ చేయడం వల్ల మీడియా అటెన్షన్ దొరకడం తప్ప ఒరిగేదేమీ లేదని సదరు వెబ్ సైట్ చెప్పుకొచ్చింది. దీనిపై పూనమ్ కౌర్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ''ఆ డైరెక్టర్ ఎంత ఇచ్చాడు..?'' అని ప్రశ్నించింది. అలానే మరో ప్రసార మాధ్యమం పూనమ్ ట్వీట్స్ గురించి ఆర్టికల్ రాస్తూ 'పూనమ్ కౌర్ నిందారోపణలు చేస్తోంది' అంటూ ప్రచురించింది. దీనికి పూనమ్ స్పందిస్తూ.. ''నేను నిందించడం లేదు... ఇది బ్లడీ ట్రూత్'' అని సమాధానం ఇచ్చింది.