పవర్ స్టార్ 'జల్సా' వివాదంపై ఇన్నాళ్ళకి క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Update: 2020-05-06 02:30 GMT
పూనమ్ కౌర్.. సినిమాలతో కంటే వివాదాలతో బాగా గుర్తింపు పొందిన హీరోయిన్. పవన్ కళ్యాణ్ ఇష్యూతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఆమె తరచూ వైరాగ్యంతో కూడిన ట్వీట్లు చేస్తుండటంతో ఎవర్ని ఉద్దేశించి చేస్తుంది.. ఎందుకు చేస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ - జల్సా చిత్రాల అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ గతంలో ఎన్నో ట్వీట్స్ చేసింది. తెరవెనుకు జరిగిన విషయం ఏంటన్నది ఎవరికీ తెలియకపోయినప్పటీ పూనమ్ కౌర్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆ మధ్య కాలంలో కత్తి మహేష్ ఈ ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడిచిందంటూ వార్తల్లోకి రావడంతో పూనమ్ - పవన్ ఇష్యూ ఎప్పుడూ హాట్ టాపిక్‌ గానే ఉంటుంది.

పూనమ్ పెట్టే ట్వీట్లు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే అనేవారు చాలామందే ఉన్నారు. దీనికి కారణం ఆమె చేసే పోస్ట్‌లలో పీకే లవ్స్ అనే హ్యాష్ ట్యాగ్‌ ను తరుచుగా వాడటం.. అలాగే పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఆయన సినిమాలకు దగ్గరగా ఉండే పేర్లను వాడటం వల్ల రకరకాలా గాసిప్స్ పుట్టుకొచ్చాయి. దీనితో పూనమ్ కౌర్ ని పలు సందర్భాల్లో పవన్ అభిమానులు ట్రోల్ చేశారు. అయితే 'PK' అంటే 'పూనమ్ కౌర్' అని చాలాసార్లు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. తాను చేసిన ట్వీట్స్ ని మరో కోణంలో ప్రచారం చేయొద్దంటూ పూనమ్ పలు సందర్భాల్లో నెటిజన్లని కోరింది. అయితే 'జల్సా' చిత్రంలో అవకాశం ఇస్తామని చెప్పి పవన్ - త్రివిక్రమ్ లు పూనమ్ కౌర్ ని మోసం చేశారని.. అందువల్ల వారిపై కోపంతోనే పూనమ్ ఇలాంటి ట్వీట్స్ వేస్తోందనే రూమర్ ఉంది. ఎట్టకేలకు పూనమ్ కౌర్ ఈ వివాదంపై డైరెక్ట్ గా స్పందించింది.

దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా పూనమ్ కౌర్ 'జల్సా' చిత్రం గురించి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. పూనమ్ స్పందిస్తూ .. 'ఎన్నికల సమయంలో నా గురించి అనేక పుకార్లు వినిపించాయి. జల్సా చిత్రంలో నాకు అవకాశం దక్కలేదని నేను అప్ సెట్ అయినట్లు ప్రచారం జరిగింది. అవన్నీ తప్పుడు వార్తలు, అసత్యాలు. నా కెరీర్ లో నేను ఒక్క దాసరి గారి దర్శకత్వంలో తప్ప మరే దర్శకుడితో పనిచేయాలని కలలు కనలేదని' తెలిపింది. ఒక అమ్మాయిపై ఇలాంటి రూమర్లు సృష్టించడం చాలా సులభం. నా గురించి జరుగుతున్న ప్రచారంపై నేనెవ్వరికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని పూనమ్ కౌర్ తెలిపింది. అయితే దీని మీద కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'చెప్పాల్సిన అవసరం వున్నపుడు ఎంతమంది అడిగింటారు మిమ్మల్ని రెస్పాండ్ అవ్వండి అని.. అప్పుడు ఎవరు అడ్డుపడ్డారు నిజం చెప్పడానికి.. ఇపుడు ఎవరు అడిగారని అన్ ట్రూ అంటున్నారు. వెబ్ సైట్ వాడు రాసారు అనా.. అటెన్షన్ వస్తుందని ఇప్పుడు చెప్తున్నారా' అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇప్పటి నుండైనా అమ్మడి మీద వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
Tags:    

Similar News