వివాదాలు కొన్ని.. కెరీర్ జర్నీ కొంత.. పాపులారిటీ బోలెడంత ఉన్న నటి పూనమ్ కౌర్. అన్నిటినీ మరిచి ప్రశాంత చిత్తంగా శ్రీ తిరుమలతిరుపతి వేంకటేశుని సందర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కు తీర్చుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని కౌర్ అన్నారు.
కుటుంబ సభ్యులతో వీవీఐపీ బ్రేక్ దర్శనం అనంతరం మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.. శ్రీవారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందుకున్న పూనమ్.. స్వామివారి వస్త్రాలంకరణతో గౌరవాన్ని అందుకోవడమే గాక.. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుమల నుంచి కంచికి వెళ్ళి అమ్మ వారిని దర్శించుకుంటానని పూనమ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా జీఎస్టీ గురించి చేనేత బాగు గురించి పూనమ్ ప్రస్థావించారు. చేనేత కార్మికుల జీవనోపాధి గురించి శ్రీవారిని ప్రార్థించానని కూడా పూనమ్ అన్నారు. మొదటి సారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నానని తెలిపారు.