బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నటీనటులు ఇండస్ట్రీలో నెపోటిజంపై సుదీర్ఘ చర్చ జరుపుతున్నారు. తమ జీవితంలో డిప్రెషన్ కి గురైన సంఘటనలను వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆమె డిప్రెషన్ కి లోనవడానికి టాలీవుడ్ లో గుర్తింపు పొందిన ఓ స్టార్ డైరెక్టర్ కారకుడయ్యాడని వరుస ట్వీట్లతో చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ప్రముఖ వెబ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన పూనమ్ కౌర్ సంచలన విషయాలు బయటపెట్టిందట. టాలీవుడ్ లో నాకు జరిగిన అన్యాయంపై మాట్లాడటం ఇదేమీ కొత్తకాదని.. గత రెండేండ్లుగా ఈ విషయంపై నా పోరాటం కొనసాగిస్తున్నానని చెప్పిందట. నా జీవితాన్ని నాశనం చేసిన వారి వల్ల నేను సుశాంత్ లా డిప్రెషన్ తో సూసైడ్ చేసుకోను.. నా కెరీర్ ని నాశనం చేసిన ఆ డైరెక్టర్ కి ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వకూడదు.. నేను ఎంత బాధపడ్డానో అతను కూడా అంతే బాధను అనుభవించాలి.. నేను చనిపోకుండా ఉండాలంటే ఇలాంటి ట్వీట్లు చేయాల్సిందే అని పూనమ్ చెప్పుకొచ్చిందట.
అంతేకాకుండా ఆ డైరెక్టర్ చేసిన పని వల్ల నా కెరీర్ నా పర్సనల్ లైఫ్ సర్వనాశనం అయిందని.. నా సంతోషాన్ని మనఃశాంతిని నా పేరుని నా అవకాశాలను దెబ్బ తీశాడని.. అతని వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని.. అలాంటి వ్యక్తిని ఎలా వదిలిపెట్టమంటారని పూనమ్ ప్రశ్నించిందట. ఆ డైరెక్టర్ గురించి కంప్లైంట్ చేయడానికి ఓ పొలిటిషియన్ ని కలిశాను.. అతన్ని ఆ డైరెక్టర్ ప్రభావితం చేశాడు. ఆ డైరెక్టర్ గురించి మాట్లాడకుండా ఉండటానికి చాలామంది రాజకీయ నాయకులు నాకు ఫోన్ చేశారు. సుమారు 15 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చి నా నోరు మూయించాలని చూశారని అని పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారట. ఇక మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ కి ఫిర్యాదు చేశాను. కానీ వారు పెద్దగా స్పందించలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని కొంత మంది హీరోయిన్లకు చెప్పగా.. ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పిందట. ఇటీవల ఓ ప్రొడ్యూసర్ కాల్ చేసి అతని ఫ్యాన్స్ నన్ను వదిలిపెట్టరని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసిందట. మరి రాబోయే రోజుల్లో పూనమ్ కౌర్ వ్యాఖ్యలు ఎక్కడి దాకా దారితీస్తాయో చూడాలి.