లాక్ డౌన్ రూల్‌ బ్రేక్ చేసిన‌ శృంగార తార అరెస్ట్

Update: 2020-05-11 04:08 GMT
అందాల ఆర‌బోత‌లో పాశ్చాత్య ధోర‌ణితో రచ్చిపోయే శృంగార తార‌గా పూన‌మ్ పాండే స్పీడ్ గురించి తెలిసిందే. సామాజిక మాధ్య‌మాల్లో శ్రుతిమించిన ఫోటోషూట్లు వీడియో షూట్ల‌ను అభిమానుల‌కు షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది. నిరంత‌రం ఏదో ఒక వివాదాస్పద వ్య‌వ‌హారంతో పూన‌మ్ ట‌చ్ లో ఉంటుంది. ర‌క‌ర‌కాల వేడెక్కించే కామెంట్ల‌తో నెటిజ‌నుల నుంచి అక్షింత‌లు వేయించుకుంది ప‌లుమార్లు. సోష‌ల్ మీడియాల్లో అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌లు.. వేడెక్కించే కామెంట్లు ఇవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌నల‌ ఆదాయ ఆర్జ‌న కోసం పూన‌మ్ ఆడిన నాట‌కాలు అంటూ నెటిజ‌నులు ఇప్ప‌టికే గ్ర‌హించారు.

అదంతా స‌రే కానీ.. దేశం మొత్తం క‌రోనా క‌ల్లోలంతో అల్లాడి పోతుంటే.. ఈ లాక్ డౌన్ వేళ ఎలాంటి నియ‌మ‌నిబంధ‌న‌ల్ని పాటించకుండా మెట్రో న‌గ‌రంలోని రోడ్డుపై షికారుకు వ‌చ్చింది ఈ అమ్మ‌డు. అయితే రూల్ బ్రేక్ చేసినందుకు పోలీసులు ఈ న‌టిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు తార‌లు లాక్ డౌన్ నియ‌మాన్ని తుంగ‌లో తొక్కి బ‌య‌ట తిరిగిన ఫోటోలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. చాలామంది తార‌లు ఏదో ఒక మంచి ప‌ని కోసమో పేద‌ల‌కు సాయం చేసేందుకో రూల్స్ బ్రేక్ చేశారు. కానీ పూన‌మ్ ఎందువ‌ల్ల అలా రోడ్ల పైకి వ‌చ్చిందో తెలియాల్సి ఉందింకా.

మోడ‌లింగ్ రంగం నుంచి సినీరంగంలో అడుగు పెట్టిన పూన‌మ్ ప‌లు హిందీ చిత్రాలు స‌హా తెలుగు సినిమాల్లోనూ న‌టించింది. దీంతో పూన‌మ్ యాక్టివిటీస్ పై తెలుగు మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం దేశం ప్ర‌మాదంలో ఉంది. భారతదేశంలో 62939 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. వీటిలో 41472 కేసులు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 19357 మంది అనారోగ్యం నుండి కోలుకోగా.. 2109 మంది వైరస్ ముప్పుతో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితి లో లాక్ డౌన్ నియ‌మాల్ని ఉల్లంఘిస్తే ప‌రిణామాలు ఎలా ఉంటాయో ఊహించ‌డమే క‌ష్టంగా ఉంది. క‌రోనా ఉధృతి దృష్ట్యా ఈనెలాఖ‌రు వ‌ర‌కూ లాక్ డౌన్ ని కొన‌సాగించాల‌ని ప‌లు ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News