కరోనా వైరస్ తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో కుదురుగా ఇంట్లో ఉండకుండా లేని తంటాలు తెచ్చుకుంది నటి పూనమ్ పాండే. ఎల్లప్పుడూ సోషల్ మీడియాను హీటెక్కించే ఈ శృంగార తార.. అరెస్ట్ అయింది అనగానే దేశవ్యాప్తంగా అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. కానీ అమ్మడు మాత్రం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తన బిఎమ్‌డబ్ల్యూ కారులో డైరెక్టర్ సామ్ అహ్మద్ బాంబేతో కలిసి చక్కర్లు కొడుతూ ముంబై పోలీసులకు చిక్కింది. రాత్రి పూనమ్ పాండేను గుర్తించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ రోడ్డుపై తిరుగుతున్న క్రమంలో వారిని అరెస్ట్ చేసినట్టు జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ మీడియా ముందు ధ్రువీకరించారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో వీద్దరిపై ఐపీసీ సెక్షన్లు 188, 269, అలాగే డైజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
అయితే కారుని సీజ్ చేసిన పోలీసులు కొద్ది సేపటి తర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద వీరిని విడిచిపెట్టినట్టు తెలిపారు. అయితే పోలీసుల కథనాలకు విరుద్ధంగా పూనమ్ ఓ వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. అసలు నిన్న రాత్రంతా నేను వరుసగా సినిమాలతో గడిపేశాను. నాన్ స్టాప్ మూడు సినిమాలు చూశాను. నేను శ్రద్దగా సినిమా చూస్తూ ఇంట్లోనే ఉన్నా.. నేను అరెస్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయని కొందరి ఫోన్ కాల్ ద్వారా నాకే తెలిసింది. మీడియాలో కూడా ఆ వార్తను చూసి షాక్ అయ్యాను. అలాంటి వాస్తవం లేని వార్తలు నాపై ప్రచారం చేయడంతో నాకు ఎంతో బాధ కలిగింది. దయచేసి అవాస్తవాలను నాపై మోపి ప్రచారం చేయకండి.. రాయకండి. నేను ఇంట్లోనే ఆరోగ్యంగా హాయిగా ఉన్నాను" అంటూ పూనమ్ పాండే తను సేఫ్ గా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో పూనమ్ అభిమానులు కాస్త కుదుట పడ్డారు.