ఆ పోర్న్ స్టార్ చనిపోయిందా? చంపేశారా?

Update: 2017-12-08 04:12 GMT
మన దగ్గర పోర్న్ ఫిలిమ్స్ అంటే కాస్త చిన్నచూపు ఉండొచ్చేమో కానీ విదేశాల్లో అదో పెద్ద ఇండస్ట్రీ. అందులో కొందరికి స్టార్ ఇమేజ్ కూడా ఉంటుంది. కెనడియన్ నటి ఆగస్ట్ ఏమ్స్ కు పోర్న్ ఇండస్ట్రీలో పిచ్చ పాపులారిటీ ఉంది.  నాలుగేళ్ల క్రితం ఈ తరహా ఫిలిమ్స్ లో నటించడం మొదలెట్టిన ఈ 23 ఏళ్ల భామ ఇంతవరకు 270కి పైగా ఫిలిమ్స్ లో నటించింది. ఆమె వీడియోలకు ఓ ఫేమస్ వెబ్ సైట్ లో 425 మిలియన్లకు పైగా వ్యూయర్ షిప్ ఉంది. ఆ సైట్ లో పాపులర్ స్టార్లలో ఆమెది తొమ్మిదో స్థానం. దగ్గరదగ్గర 5 లక్షల డాలర్లకు పైగా ఆస్తులు ఆమె సొంతం. అందులో అత్యధికం పోర్న్ ఇండస్ట్రీ నుంచే వచ్చిందని అంచనా.

ఇంత పాపులారిటీ సంపాదించి ఆగస్ట్ ఏమ్స్ అనూహ్య రీతిలో చనిపోయింది. ఆమె ఉరేసుకు ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఓ సినిమాలో నటించనని తెగేసి చెప్పడమే కాదు.. పోర్న్ ఇండస్ట్రీలో ఏజెంట్లను తన ట్వీట్లతో దులిపి అవతల పారేసింది. విషయమేంటంటే ఏమ్స్ కు వచ్చిన తాజా ఆఫర్ లో ఆమెకు పార్టనర్ గా ఇంతకుముందు గే సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తిని ఎంపిక చేశారు. తమ శరీరంతో ప్రయోగాలు చేసే హక్కు మీకెక్కడుంది అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా సంబంధిత ఏజెంట్లపై విరుచుకుపడింది. దీనిపై పలువురు ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినా ఆమె లెక్క చేయలేదు. మా శరీరం గురించి మేం జాగ్రత్త తీసుకుంటే మీకెందుకు అక్కసు అంటూ ఘాటుగా రిప్లయిలచ్చింది.

ఈ వివాదం ఇలా ఉండగానే ఏమ్స్ చనిపోయి కనిపించడంతో పలు అనుమానాలు మొదలయ్యాయి. ఆమె చనిపోలేదని... కావాలనే చంపేశారంటూ ఆమె అభిమానులు ఆగ్రహిస్తున్నారు. అంత డేరింగ్ గా నిజాలు మాట్లాడిన ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంటున్నది వారు వేస్తున్న ప్రశ్న. నిజాలు మాట్లాడటం చాలామందికి నచ్చదు. అది ఇక్కడే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా అలాగే ఉంటుందేమో?  


Tags:    

Similar News