పోర్న్ స్టార్ దారుణ నిర్ణయం.. కార‌ణం అదేనా?

Update: 2021-07-18 09:10 GMT
అమెరిక‌న్ పోర్న్ స్టార్ డ‌మ్లియా స్కై ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విష‌యాన్ని లాస్ ఏంజిల్స్ పోలీసు అధికారులు ధృవీక‌రించారు. రెండు వారాల క్రితం ఈ దారుణ జ‌రిగింది. తుపాకీతో కాల్చుకొని త‌న కారులోనే ఆత్మ‌హ‌త్య చేసుకుంది పోర్న్ స్టార్ డ‌మ్లియా స్కై.

ఆమె మృతి స‌మాచారం అందుకున్న పోలీసులు.. వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని బాడీని స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం కేసు న‌మోదు చేసి విచార‌ణ మొద‌లు పెట్టారు. కారులో చ‌నిపోయి ఉండ‌డం.. ప‌క్క‌నే రివాల్వ‌ర్ ఉండ‌డంతోపాటు ఇత‌ర ఆధారాల ప్ర‌కారం.. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టుగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు పోలీసులు తెలిపారు.

అయితే.. డ‌మ్లియా స్కై ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల‌ కార‌ణం ఏంట‌నే విష‌య‌మై పోలీసులు ఆరాతీశారు. దీనికి కార‌ణం ఆమె క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డ‌డమేన‌ని తేలింద‌ట‌. డ‌మ్లియా స్కై బ్రెస్ట్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఫోర్త్ స్టేజ్ లో ఉంద‌ని స‌మాచారం. దీంతో.. ఆమె తీవ్ర డిప్రెష‌న్లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఈ ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డ‌లేక‌నే ప్రాణాలు తీసుకొని ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 2010లో డ‌మ్లియా స్కై పోర్న్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. దాదాపు ప‌దేళ్ల‌పాటు పోర్న్ స్టార్ గా రాణించింది. అయితే.. ఊహించ‌ని క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతూ వ‌చ్చింది. ప‌లు ద‌శ‌లు దాటిన మ‌హ‌మ్మారి.. త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లో ఈమె బ‌ర్త్ డే కూడా ఉంది. ఈ స‌మ‌యంలో ఇలాంటి దారుణం జ‌ర‌గ‌డం బంధువులు, అభిమానుల‌ను విషాదంలో ముంచేసింది.
Tags:    

Similar News