రచయిత కమ్ నటుడు పోసాని కృష్ణ మురళి గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరు. సహజంగా మన సమాజంలో అంతా హిపోక్రసీనే. ఇక సినిమా ఇండస్ట్రీలో హిపోక్రసీ ఇంకా ఎక్కువ. ఓపెన్ గా.. ఫ్రాంక్ గా మాట్లాడేవారిని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. అలా ముక్కుసూటిగా ఏ విషయంపైన అయినా తన అభిప్రాయాన్ని చెప్పే వారిలో పోసాని ఒకరు. అయన దగ్గర దాపరికాలు.. షుగర్ కోటింగులు ఉండవ్!
కొద్దిరోజుల క్రితం పోసానికి సర్జరీ జరిగింది.. దీంతో ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నారు. అయినప్పటికే ఒక లీడింగ్ న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తనదైన శైలిలో కొన్ని విషయాలపై కుండబద్దలు కొట్టారు. జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి కావడం తన కల అని.. అది తీరిందని వ్యాఖ్యానించారు. జగన్ వ్యక్తిత్వంపై.. పాలనపై సంపూర్ణమైన విశ్వాసం ఉందని వెల్లడించారు. ఒకవేళ జగన్ కూడా హామీలు నెరవేర్చలేకపోతే.. అవినీతికి పాల్పడితే ఇప్పుడు చంద్రబాబును టీడీపీ ని విమర్శిస్తున్నట్టుగా.. జగన్ ను కూడా విమర్శిస్తారా? అని అడిగితే.. అలాంటి పరిస్థితే వస్తే తప్పనిసరిగా విమర్శిస్తానని..కానీ అటువంటి పరిస్థితి రాదనే నమ్మకం తనకు ఉందని అన్నారు.
2024 ఎన్నికలకు టీడీపీ తిరిగి పుంజుకుంటుందా? టీడీపీది ముగిసిన అధ్యాయం అంటారా? అని అడిగితే... ముగిసిన అధ్యాయం అని చెప్పనని రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయని అన్నారు. అయితే చంద్రబాబు లాంటి నాయకుడు.. టీడీపీ లాంటి పార్టీ ఈ ఎపీకి అవసరం లేదని అందరూ అంటున్నారని చెప్పాడు.
జగన్ మోహన్ రెడ్డికి బాహాటంగా మద్దతు తెలపడం వల్ల ఫిలిం ఇండస్ట్రీలో మీరు ఒంటరి కాలేదా అని అడిగితే "ఎలెక్షన్ దగ్గరకు రాగానే మావాళ్ళకు కోపం వచ్చింది. నాకు వేషాలు తగ్గాయి. వేషాలు లేకుండా చేశారు. నాకు జబ్బు రాకముందు కూడా తగ్గాయి. కానీ నేనంటే వ్యక్తిగతంగా అభిమానం ఉండేవారు మాత్రం నాకు అవకాశాలు ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీని తిట్టాడని.. మన చంద్రబాబును విమర్శిస్తున్నాడనే పేరుతో నాకు అవకాశం ఇవ్వకుండా చేసిన వారు ఉన్నారు. ఆల్రెడీ లిస్టులో రాసిన నా పేరును కూడా కొట్టేయించారు. ఆయన ఎవరో కాదు అశ్విని దత్" అంటూ బాంబు పేల్చారు పోసాని.
ఇక రాం గోపాల్ వర్మ ప్రకటించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా టైటిల్ ఒక కులాన్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది కదా? అని ప్రశ్నిస్తే "అవును. రామ్ గోపాల్ వర్మది తప్పు. కమ్మ రాజ్యం అంటే కమ్మవాళ్లను మాత్రమే చంద్రబాబు పరిపాలించలేదు.. అందరినీ పరిపాలించాడు. చంద్రబాబు చేసిన పొరపాట్లు.. ఆయన చేసిన అవినీతి గురించి కామెంట్ చెయ్యాలి కానీ ఇలా అనడం కరెక్ట్ కాదు అని అభిప్రాయపడ్డారు. ఆ టైటిల్ 100% తప్పు. నేను ఖండిస్తున్నా" అన్నారు.