ఒకప్పటి త్రివిక్రమ్ కు.. ఇప్పటికు త్రివిక్రమ్ కు.. ఏంటి తేడా?? ఆ విషయం ఎవరిని అడగుతాం.. ఆయనతో పనిచేసిన వారినో లేకపోతే ఆయన క్రింద పనిచేసిన వారినో.. లేకపోతే ఆయనకు అప్పట్లో పనిచ్చిన వారినో అడగాలి. సరిగ్గా ఇప్పుడు అదే పని చేద్దాం పదండి.
90లలో త్రివిక్రమ్ ఇండస్ర్టీకి వచ్చిన కొత్తల్లో.. మనోడికి 4 సంవత్సరాలపాటు తన దగ్గర పనిచ్చాడు పోసాని కృష్ణమురళి. అప్పట్లో ఆయన రైటర్ గా ఏకంగా 100 సినిమాలకు రాశాడంటే.. ఖచ్చితంగా తన టీమ్ లో త్రివిక్రమ్ వంటి దిగ్గజాలు ఉండబట్టేనేమో. ఈయన ఇప్పుడు త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ.. ''26 సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నాడు. అదే మాట తీరు. అదే వినయం. అదే రెస్పక్ట్ ఇచ్చే పద్దతి. ఏమాత్రం మారలేదు. ఇప్పుడు కాస్త గెడ్డం పెంచాడు అంతే. అప్పుడు నా దగ్గర పనిచేశాడు. నేనిప్పుడు తన దగ్గర పనిచేస్తున్నాను. అంతే తేడా'' అంటూ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు.. త్రివిక్రమ్ రాసే డైలాగులూ.. కథల గురించి చెబుతూ.. ''వట్టి మాటలు రాస్తున్నాడు కాని.. కథ రాయలేకపోతున్నాడు త్రివిక్రమ్ అనుకునేవాడిని. అయితే కేవలం మాటలతోనే కథను తయారు చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు మనోడు. అందుకు చాలా హ్యాపీగా ఉంది. అ..ఆ సినిమాలో ఓ మాంచి దుర్మార్ధపు వేషం ఇచ్చాడులే. ఇరగదీశా'' అంటూ ముగించాడు పోసాని.