మాట మార్చేసిన పోసాని

Update: 2017-06-28 05:18 GMT
విపరీతమైన క్రేజ్ ఉన్న రియాలిటీ బిగ్ బాస్.. స్థానిక వెర్షన్స్ కు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందనే సంగతి ఇప్పటికే చెప్పుకున్నాం. ఈ షో తెలుగు వెర్షన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయనుండగా.. పార్టిసిపెంట్స్ లెక్క తేలడం లేదు. అయితే.. ఈ కార్యక్రమంలో కచ్చితంగా పాల్గొంటాడంటూ.. ఇప్పటివరకూ వినిపించిన ఒకే ఒక్క పేరు రైటర్ కం యాక్టర్ పోసాని కృష్ణమురళి దే.

కానీ ఇప్పుడు పోసాని కూడా మాట మార్చేశాడు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను.. పోసాని కృష్ణమురళికి 2.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని.. పోసాని కూడా ఇందుకు సై అన్నాడనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మాత్రం.. తనకు అసలు ఎలాంటి ఆఫర్ రాలేదని అంటున్నాడు. బిగ్ బాస్ షోకి సంబంధించిన నిర్వాహకులు ఎవరూ తనను అప్రోచ్ కూడా కాలేదని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే.. పోసాని కృష్ణమురళికి బిగ్ బాస్ నుంచి పిలుపు రావడం నిజమే అయినా.. వాళ్లు చెప్పిన రెమ్యూనరేషన్ ఫిగర్ మాత్రం నచ్చలేదట. ఆఫర్ నచ్చకపోవడంతో అసలు తనకు ఆఫరే రాలేదని అంటున్నాడట.

ఇంకా అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ కాకపోవడంతో.. పోసాని మాటను ఖండించే అవకాశం నిర్వాహకులకు లేదని అంటున్నారు. ఈ సంగతేమో కానీ.. తెలుగు బిగ్ బాస్ కు హోస్ట్ ని కరెక్ట్ గానే ఎంపిక చేసుకున్నా.. పార్టిసిపెంట్స్ ను ఫైనల్ చేయడంలో మాత్రం.. నిర్వాహకులకు తలబొప్పి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News