రైటర్ నుంచి కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారి తనదైన డైలాగ్ మాడ్యులేషన్ - యాక్షన్ తో దూసుకుపోతున్నాడు పోసాని కృష్ణ మురళి. తను నటించిన ప్రతీ చిత్రంలోనే నటనలో వేరియేషన్ ఎక్కువగా లేకపోయినా.. డైలాగులతోనే ఆకట్టుకోవడంలో పోసాని అదుర్స్ అనాల్సిందే. పాత్రను బట్టి ఒదిగిపోయే తీరులో.. ఈ తరం కమెడియన్లలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. రీసెంట్ గా పోసానికి వస్తున్న పాత్రలు కూడా చాలా వైవిధ్యంగాను, ప్రాధాన్యత ఉండేవిగాను ఉంటున్నాయి.
రాజా... అంటూ ఓ పంచ్ డైలాగ్ ను ఫినిష్ చేయడం.. పోసాని సృష్టించిన ఓ ట్రెండ్. ఏప్రిల్ 1న విడుదల కానున్న నారా రోహిత్ మూవీ సావిత్రి లో కూడా పోసాని కృష్ణమురళి కేరక్టర్ చాలా బాగావచ్చిందని అంటున్నాడు దర్శకుడు పవన్ సాదినేని. సావిత్రిలో పోసాని నటన - మేనరిజం - డైలాగ్స్.. ఇలా ప్రతీదీ చక్కగా కుదిరాయని తెలుస్తోంది. ఈ రోల్ కనిపించిన ప్రతీ సీన్ ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచెత్తుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా మొత్తానికి పోసాని కృష్ణమురళి పోషించిన రోల్ స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారంటే.. ఈ పాత్రపై ఎంతగా నమ్మకం పెట్టుకున్నారో అర్ధమవుతుంది.
నారా రోహిత్ కు జంటగా నందిత నటించిన ఈ మూవీపై... అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టెయినర్ జోనర్ లో వస్తున్న చిత్రం కావడం, 2 వారాల క్రితమే నారా రోహిత్ ఓ హిట్ కొట్టి ఫాంలో ఉండడంతో.. ఆడియన్స్ లో కూడా సావిత్రిపై హోప్స్ ఎక్కువగానే ఉన్నాయి