వెన్నుపోటు పొడిస్తే వ‌దిలేస్తారా?

Update: 2019-03-08 17:51 GMT
ఆర్జీవీ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` వివాదాల గురించి తెలిసిందే. అన్ని వివాదాల న‌డుమ ఈ సినిమా సెన్సార్ గ‌డ‌ప‌పైకి వెళ్లేందుకు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఈనెల 22న సినిమా రిలీజ్ తేదీని ఫైన‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. నేటి సాయంత్రం సింహ గ‌ర్జ‌న పేరుతో ఆర్జీవీ బృందం మీడియా లైవ్ లోకి వ‌చ్చింది. ఈ లైవ్ కార్య‌క్ర‌మంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో ఓ కీల‌క పాత్ర పోషించిన పోసాని కృష్ణ‌ముర‌ళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని బయటకు రానివ్వరు. పలానా పార్టీ వాళ్లు ఆపేస్తారు. థియేటర్ వద్ద గొడవ చేస్తారు. సెన్సార్ అవ్వ‌దు అంటూ ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకున్నారు. ఇవన్నీ వెధవ వేశాలు వేయడం ఎందుకు? నువ్వు నిజాయితీగా ఉండొచ్చు క‌దా అంటూ పోసాని సీరియ‌స్ అయ్యారు. ఎవ‌రైతే నిజాయితీగా ఉండరో.. నీతిగా ఉండరో వారికే ఈ సమస్యలు వస్తాయి. వాజ్ పేయికి రాలేదు. అద్వానీకి రాలేదు. చాలా మంది నిజాయితీ పరులైన వారికి రాలేదు.  అవినీతి పనులు చేసిన వారికి.. వెన్నుపోటు పొడిచిన వారికి వస్తాయి బాధ‌లు అని అన్నారు. నువ్వు ఆ పనులు చేయకపోయి ఉంటే రామూ ఈ రోజు ఈ సినిమా తీయడు కదా. ఏ రామాయణమో.. మహాభారతమో తీసేవాడు. నువ్వు వెధవ వేశాలు వేస్తే రామూ తీయడానికి రెడీగా ఉంటాడు అని తిట్టేశారు. ప్రజాస్వామ్యంలో ఉండీ.. ప్రభుత్వంలో ఉండి లంగా పనులు చేస్తుంటే రామూ ఎందుకు వదిలిపెడతాడు? నేనూ రాజకీయాల్లోకి వచ్చినా.. వెధవ పని చేసినా రామూకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతడు సిటిజెన్.. ఓటర్ అంటూ ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు పోసాని.

జరిగిన కథ తీశారు. ముక్క ముట్టుకోకుండా సెన్సార్ నుంచి బయటకు వస్తే ప్రజలు రియలైజ్ అవుతారు. సినిమాలో ఎవరైనా నీతి మంతుడు ఉంటే వారికి ఓట్లు పడతాయి. ఎవరైతే వెధవ వేశాలు వేశాడు అని జనం అభిప్రాయ పడితే వాడు తప్పకుండా నాశనం అయిపోతాడు అంటూ పోసాని విరుచుకుప‌డ్డారు. ఓ ర‌కంగా పోసాని ఎవ‌రిని తిట్టాలో వాళ్ల‌ను టార్గెట్ చేసి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ వేదిక‌పై తిట్టేయ‌డం జ‌నాల్లో వైర‌ల్ అయిపోతోంది.
Tags:    

Similar News