గత కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య ప్రతిష్టంభణ నెలకొన్న విషయం తెలిసిందే. భారీ చిత్రాలకు టికెట్ రేటు పెంచుకునే వెసులు బాటు లేకుండా ఏపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అంతే కాకుండా టికెట్ లని స్వయంగా ప్రభుత్వమే విక్రయిస్తుందని కొత్త జీవో తీసుకొచ్చింది. దీంతో చాలా వరకు పెద్ద చిత్రాలు నష్టాలని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ విధానం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సమస్య పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి ముందు కదిలారు.
కొన్ని వారాల క్రితం చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ కోరడం.. వెంటనే భోజన విరామ సమయంలో మెగాస్టార్‌కు ఏపీ ముఖ్యమంత్రి అపాయంట్ మెంట్ ఇవ్వడం తెలిసిందే. అయితే ఆ భేటీ తరువాత ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో గురువారం మరోసారి చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించారు. తనకు మాత్రమే ఆహ్వానం అందిందని చెప్పిన చిరు చెప్పడం కొంత గందరగోళాన్ని సృష్టించింది. అయితే చిరుతో పాటు ప్రభాస్ - మహేష్ బాబు - దర్శకుడు కొరటాల శివ - రాజమౌళి - నిర్మాత నిరంజన్ రెడ్డి - అలీ - ఆర్. నారాయణమూర్తి - పోసాని కృష్ణమురళి కూడా హాజరయ్యారు. వీరికంటే ముందే అలీ - ఆర్. నారాయణమూర్తి - పోసాని కృష్ణమురళి అమరావతి చేరుకున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన `రిపబ్లిక్` మూవీ ప్రీ రిలీజ్ లో పవన్ కల్యాణ్ వైసీపీ నేతలతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఎంటరై పవన్ పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. జగన్‌తో నువ్వు పోల్చుకోలేవంటూ సరికొత్త వివాదానికి తెరలేపారు. పంజాబీ అమ్మాయి అంటూ మరింత రచ్చకు తెరలేపారు.
దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు నిలబడితే పోసాని మరో పక్క నిలబడి చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి శ్రీకారం చుట్టాయి. అప్పటి నుంచి మీడియా ముందుకు రాలేదు పోసాని. ఇన్ని నెలల విరామం తరువాత మళ్లీ గురువారం ఏపీ మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. టికెట్ వివాదం తో పాటు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు గురువారం ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మీడియా ముందు ప్రత్యక్షం కావడం ప్రధాన్యతని సంతరించుకుంది. ఇదిలా వుంటే పోసాని ఏ హోదాలో భేటీకి హాజరయ్యారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్ లు సెటైర్లు వేస్తున్నారు. ఇదే సమయంలో పోసాని స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ లు పారితోషికాలు తగ్గించుకుంటే మంచిదని పోసాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖంగానే పరుషంగా మాట్లాడారని కూడా చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా నెటిజన్ లు మండిపడుతున్నారు.