సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా ముగిసిపోయింది. భాగమతి ఎంజాయ్ చేయటం పూర్తయ్యింది. సినిమా ప్రేమికులు కొత్త మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్లుండి ఒకేసారి మూడు సినిమాలు రానుండటం ఆసక్తిని రేపుతోంది. అందులో హైప్ పరంగా టాప్ చైర్ ప్రస్తుతానికి రవితేజ టచ్ చేసి చూడుదే అయినప్పటికీ మిగిలిన రెండు సినిమాల్లో ఏదైనా ఒకటి స్వీట్ షాక్ ఇవ్వకపోదా అనే అంచనాలలో ఉన్నారు ప్రేక్షకులు. ఒకరోజు ఆలస్యంగా వస్తున్న రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ మౌత్ పబ్లిసిటీ వచ్చాక కాని ఓపెనింగ్స్ రెండో మూడో రోజో వచ్చే అవకాశాలు లేవు. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ ఇమేజ్ లేని రాహుల్ మూవీ కంటెంట్ ఉంటే తప్ప నిలవడం కష్టం.ఒకవేళ ఉందంటే మాత్రం సర్ప్రైజ్ హిట్ ఖాతాలో పడుతుంది. ఇవి కాకుండా వస్తున్న మరో సినిమా ఛలో మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. నెలన్నర క్రితమే విడుదలైన ఓ రెండు పాటలు ఇన్స్ టాంట్ గా కనెక్ట్ కావడంతో బజ్ స్లోగా పెరుగుతూ వచ్చింది.
ట్రైలర్ వచ్చాక ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్ కం లవ్ స్టొరీ అని అర్థమైపోవడంతో యువత దీని మీద ఆసక్తి చూపుతున్నారు. కన్నడ కిరాక్ పార్టీ బ్లాక్ బస్టర్ హిట్ తో అక్కడ యమా పాపులర్ అయిన రష్మిక మండన్న హీరొయిన్ గా పరిచయం కావడం ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తోంది. తమిళనాడు, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ఒక ఊరిలో జరిగే గొడవలు నేపధ్యంగా తీసుకుని దానికో లవ్ స్టొరీ మిక్స్ చేసి దర్శకుడు వెంకీ కుడుముల టేకింగ్ మెప్పిస్తుంది అనే నమ్మకం యూనిట్ లో బలంగా ఉంది. పైగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ క చిరు రావడం బాగా వెయిట్ ఇచ్చింది ఈ మూవీకి. ఆడియో - ట్రైలర్ రెస్పాన్స్ సినిమాకు కూడా వస్తుందని యూనిట్ నమ్ముతోంది. ముఖ్యంగా చూసి చూడంగానే పాట ఇప్పటికీ టాప్ లిస్టు లో ఉంది.
కాని కంటెంట్ తో మెప్పించి యూత్ ని పడగొడితే ఛలోకి సమస్య ఉండదు. తన ఎనర్జీతో సినిమాను నిలబెట్టే రవితేజ టచ్ చేసి చూడు యావరేజ్ టాక్ వచ్చినా నిలబడుతుంది.ఒకవేళ హిట్ టాక్ వస్తే రవిని ఆపడం కష్టం. సో ఛలో దానికి ధీటుగా నిలబడాలి అంటే మాత్రం ట్రైలర్ - ఆడియోలో చూపించిన క్వాలిటీ సినిమాలో కూడా చూపించారు అంటే విజయం తధ్యం. యూనిట్ కాన్ఫిడెన్సు ఆ రేంజ్ లోనే ఉంది. చూద్దాం మరో రెండు రోజుల్లో ఇదీ తేలిపోతుంది.