మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మించిన 'క్రాక్' సినిమా నేడు శనివారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా మార్నింగ్ మ్యాట షోలు పడలేదు. ఫస్ట్ షో లేదా సెకండ్ షో పడుతుందని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు అసలు ఈ చిత్రం ఈరోజు విడుదల కావడం లేదంటూ తాజాగా మరో న్యూస్ బయటికి వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 13 లేదా 14 తేదీలలో 'క్రాక్' సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా షోలు క్యాన్సిల్ అవడంపై కానీ విడుదల విషయంలో కానీ చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా అందిన సమాచారం ప్రకారం 'క్రాక్' నిర్మాత ఠాగూర్ మధు ఆర్థిక పరమైన విషయాలను సెటిల్ చేసేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మరి కాసేపట్లో ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. చాలా నెలల తర్వాత థియేటర్లలోకి ఒక పెద్ద సినిమా రాబోతుందని సినీ అభిమానులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో 'క్రాక్' షోలు పడక పోవడం ఒకింత నిరాశను కలిగించింది. అయితే మాస్ మహారాజ్ ఫ్యాన్స్ మాత్రం ఇంకాసేపటికి షో పడుతుందేమో అంటూ థియేటర్ల వద్ద ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ షో వరకు అయినా ఇష్యూ క్లియర్ అయితే బాగుంటుందని వారు అనుకుంటున్నారు.