#PSPK రీమేక్ ల పులి అనిపించుకోవాల‌నా?

Update: 2021-01-10 11:07 GMT
స్ట్రె‌యిట్ సినిమాకి .. రీమేక్ కి మ‌ధ్య ఎంతో వైవిధ్యం ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. స్ట్రెయిట్ సినిమాకి కాల‌యాప‌న చాకిరీతో పాటు పెట్టుబ‌డి చాలా ఎక్కువ‌. ఫైన‌ల్ గా ఔట్ పుట్ ఎలా ఉంటుందో ముందే ఊహించ‌డం సులువేమీ కాదు. కానీ రీమేక్ కి అలా కాదు. ఆల్రెడీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సినిమా స్క్రిప్టునే తీసుకుని ప్రాంతం -భాష‌-క‌ల్చ‌ర్ కి అనుగుణంగా మ‌లుచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే క‌థాచ‌ర్చ‌ల కోసం స‌మ‌యం వృధా కాదు. త‌క్కువ స‌మ‌యంలో మేకింగ్ ని పూర్తి చేసేందుకు అద‌న‌పు ఖ‌ర్చులేవీ లేకుండా త‌గ్గించుకునేందుకు ప్ర‌తిదీ ఈజీ అవుతుంది. ఎడిటింగ్ .. సినిమాటోగ్ర‌ఫీ విభాగానికి శ్ర‌మ త‌క్కువ‌. ఆల్రెడీ డిజైన్ చేసిన‌దాంట్లో ప‌ని చేయాల్సి ఉంటుంది. వీట‌న్నిటికీ మించి టైమ్ క‌లిసొస్తుంది. అందుకే ఇటీవ‌లి కాలంలో రీమేక్ ల‌పై మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. హీరోలు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

నిజానికి రీమేక్ ల హీరో అన‌గానే విక్ట‌రీ వెంక‌టేష్ గుర్తుకు వ‌స్తారు. కంట్రోల్డ్ బ‌డ్జెట్లో సినిమాని డిజైన్ చేయ‌డంలో మాస్ట‌ర్ మైండ్ డి.సురేష్ బాబు వెంకీ కెరీర్ కి అలాంటి ఎన్నో రీమేక్ ల‌ను తెచ్చిన మేధావిగా చెప్పుకున్నారు.

ఇటీవ‌లి కాలంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వైఖ‌రి చూస్తున్నా రీమేక్ ల‌పై ఆయ‌న ఎక్కువ ఆస‌క్తిగా ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. కెరీర్ ఆరంభంలో కొన్ని రీమేక్ లు చేసినా కానీ.. ఇటీవ‌ల పింక్ రీమేక్ (వ‌కీల్ సాబ్)తో రీఎంట్రీ ఇచ్చాక వ‌రుస పెట్టి రీమేక్ స్క్రిప్టుల‌ను లాక్ చేసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. త‌దుప‌రి అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ లో న‌టించేందుకు ప‌వ‌న్ రెడీ అవుతున్నారు.
తన భాగాన్ని 30 - 50 రోజుల్లో పూర్తి చేయాలని దర్శకుడికి టార్గెట్ పెట్టార‌ట‌.

అంతేకాదు.. దీంతో పాటు రీమేక్ స్క్రిప్టుల్ని వ‌ర్క‌వుట్ చేయాల్సిందిగా త‌న ద‌ర్శ‌కుల‌కు సూచిస్తున్నార‌ట ప‌వ‌న్. క్రిష్- హరీష్ శంకర్ సినిమాలను వెనక్కి నెట్టి తొలిగా రీమేక్ ని చేప‌ట్టడానికి ఇదే కారణం.
ఒక రకంగా చెప్పాలంటే తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలను పూర్తి చేయడానికి ప‌వ‌న్ అనుస‌రిస్తున్న‌ వ్యూహం సరైనదేన‌ని భావించాల్సి ఉంటుంది. వెంకీ .. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ సినిమాల‌పై ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది.




Tags:    

Similar News