కల్ట్ క్లాసిక్ జోనర్ లో ఎన్నో సినిమాలొచ్చినా విజయాల శాతం తక్కువే. కానీ ఇదే జోనర్ లో వచ్చిన 'ది కశ్మీర్ ఫైల్స్' సంచలన విజయం సాధించి ఏకంగా 350కోట్లు వసూలు చేసింది. ఆరంభం డాక్యుమెంటరీలా ఉందని విమర్శలొచ్చినా ఈ సినిమాని థియేటర్లలో చూసేందుకు ఇంతటి క్రైసిస్ లోనూ జనం ఎగబడ్డారు. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ లాంటి కమర్షియల్ వేవ్ ముందున్నా కానీ డాక్యు మూవీ తరహా కశ్మీర్ ఫైల్స్ గొప్ప జనాదరణ సంపాదించింది. కశ్మీర్ హిందూ పండితుల ఊచకోత నేపథ్యంలోని ఈ సినిమాపై బోలెడన్ని ప్రశంసలు కురిసాయి.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు దర్శకనిర్మాతలు సెలబ్రిటీలు వివేక్ అగ్నిహోత్రి.. అభిషేక్ లను ప్రశంసించారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రశంసా సమావేశంలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నిర్మాతలకు ఆయన అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు.
తాజాగా ఓ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం. ఇటీవల 'ది కాశ్మీర్ ఫైల్స్' కశ్మీర్ లోయలో జరిగిన నిజమైన చరిత్రను బయటకు తీసుకువచ్చిందని .. ఈ చిత్రం చిరకాలం గుర్తుండిపోతుందని ఆయన అన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ప్రముఖులు..
అనుపమ్ ఖేర్- పల్లవి జోషి- దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రానికి సంబంధించిన తారాగణం .. దర్శకులను గ్లోబల్ కాశ్మీరీ పండిట్ డయాస్పోరా (GKPD)గడ్కరీ సమక్షంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత శ్యామ్ జాజు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర రోడ్లు రవాణా- రహదారుల శాఖ మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. ''కశ్మీరీ పండిట్ల చరిత్రకు గొప్ప నేపథ్యం ఉందన్నారు. కాశ్మీరీ పండిట్ లను వేధించడం బలవంతంగా (లోయ నుండి) తరలించడం నిజమే. కాశ్మీరీ పండిట్ల దుస్థితిని వివేక్ అగ్నిహోత్రి సరిగ్గా చిత్రీకరించారు. చరిత్రను పునఃపరిశీలించినందుకు ధన్యవాదాలు'' అని గడ్కరీ అన్నారు.
అగ్నిహోత్రి సినిమాకు దర్శకత్వం వహించిన విధానం- వాస్తవాలను .. వాస్తవిక కథను ప్రజలకు అందించిందని ఆయన అన్నారు. ఈ సినిమా చిరకాలం గుర్తుండిపోతుంది. కాశ్మీరీ పండిట్ల చరిత్ర గురించి కొత్త తరానికి కూడా ఈ సినిమా తెలిసేలా చేస్తుంది. ఇందుకు వివేక్ అగ్నిహోత్రికి ధన్యవాదాలు.. అని గడ్కరీ అన్నారు.