జాగ్ర‌త్త‌గా చేసి ఉంటే 100కోట్లు లాభ‌ప‌డేవారు!

Update: 2019-08-18 18:06 GMT
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్ష‌న్ చిత్రం `సాహో` బ‌డ్జెట్ గురించి తెలిసిందే. సినిమా ప్రారంభంలో 200 కోట్ల బ‌డ్జెట్ అనుకుంటే ఆ త‌ర్వాత అది అంత‌కంత‌కు కాన్వాసు పెంచేయ‌డంతో 350 కోట్ల మేర బ‌డ్జెట్ ఖ‌ర్చ‌య్యింద‌ని ప్ర‌భాస్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఒకే ఒక్క సినిమా తీసిన ద‌ర్శ‌కుడిని న‌మ్మి ఇంత బ‌డ్జెట్ పెట్టార‌ని నిర్మాత‌ల ధైర్యాన్ని మెచ్చుకున్నారు డార్లింగ్.

అయితే అస‌లేమాత్రం రాజీకి రాకుండా బ‌డ్జెట్ పెట్టేయ‌డం వ‌ల్ల నిర్మాత‌లు ఈ సినిమాని డెఫిసిట్ తో రిలీజ్ చేస్తున్నార‌ని ఇటీవ‌ల‌ వార్త‌లు వ‌చ్చాయి. సాహోకి 320 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. అంటే మ‌రో 30 కోట్లు డెఫిసిట్ అని చెబుతున్నారు. అయితే నాన్ థియేట్రిక‌ల్ రూపంలో నిర్మాత‌లు భారీగానే ఆర్జించే వీలుంద‌న్న సంగ‌తి తెలిసిందే. సాహో కోసం నిర్మాత‌లు చేసిన రిస్క్ గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్ర‌భాస్ ప్ర‌స్థావించారు.

``జాగ్ర‌త్త‌గా చేసి ఉంటే 100 కోట్ల లాభం వ‌చ్చి ఉండేది. కానీ అంత లాభం వ‌దిలేసి ఇంత ఖ‌ర్చు పెట్టి సినిమా తీశారు. నా స్నేహితులు అని చెప్ప‌డం ఇష్టం లేదు. ఎవ‌రికైనా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి`` అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు ప్ర‌భాస్. అంద‌రికీ ఇలాంటి స్నేహితులు ఉండాలి అని కృత‌జ్ఞ‌తాభావాన్ని క‌న‌బ‌రిచారు ప్ర‌భాస్. ఒక్క‌రోజు కూడా ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా స‌మ‌స్య లేకుండా చేశారు అంటూ ప్ర‌మోద్- వంశీ బృందాన్ని ప్ర‌శంసించారు. ఒక‌వేళ బ‌డ్జెట్ ని పెంచ‌కుండా తొలుత అనుకున్న దాంట్లోనే చేసి ఉంటే థియేట్రిక‌ల్ రైట్స్ ప‌రంగా 100 కోట్ల టేబుల్ ప్రాఫిట్స్ చేతికి వ‌చ్చి ఉండేవేన‌నేది ప్ర‌భాస్ భావ‌న కావొచ్చు. ఏదైతేనేం సాహో లాంటి భారీ ప్ర‌యోగం చేశారు. కేవ‌లం ప్ర‌భాస్ పై ప్రేమ‌తో స్నేహితులు చేస్తున్న ప్ర‌య‌త్నం ఇది. వీళ్ల గ‌ట్స్ ని వేదిక‌పై ప్ర‌ముఖులంతా పొగిడేయ‌డానికి కార‌ణం అదే.  
Tags:    

Similar News