1650 ఎకరాల అటవీప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్ !

Update: 2020-09-07 14:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ ఓఆర్ ఆర్‌ కి దగ్గరలో ఉన్న ఖాజీపల్లె అనే గ్రామంలోని అర్బన్‌ బ్లాక్‌ని సోమవారం ఆయన దత్తత తీసుకున్నారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమాన్ని బాహుబలి ప్రభాస్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సామాన్యుల నుండి ప్రముఖులు , సినీ స్టార్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మూడో విడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభాస్‌.. ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్ ‌కుమార్ చొరవ‌తో పార్కును ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భాస్ తెలిపారు. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌క్ష‌ణ సాయంగా రూ.2 కోట్లు అంద‌జేసిన‌ ప్ర‌భాస్ అవ‌స‌రాన్ని బ‌ట్టి మ‌రింత సాయం చేసేందుకు సిద్ధం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి, ఎంపీతో క‌లిసి హీరో ప్ర‌భాస్ పార్కులోని వ్యూ పాయింట్‌, త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించాడు. ఈ కార్యక్రమంలో ప్ర‌భుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇకపోతే , మూడో విడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభాస్‌.. ఎంపీ సంతోష్‌కుమార్తో కలిసి మొక్కలు నాటడమే కాకుండా, వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News