టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరినొకరు కలుసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సినిమా ఫంక్షన్స్ లోనో సెలబ్రిటీల వెడ్డింగ్స్ లోనే బర్త్ డే వేడుకల్లోనో ఇలాంటి దృశ్యం చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలకు సినీ ప్రముఖులు అందరూ హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట షికారు చేస్తున్నాయి. అయితే ఎంత మంది సెలబ్రిటీలు అటెండ్ అయినా వాటిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో మాత్రం స్పెషల్ గా నిలిచింది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో ఉన్న ప్రభాస్ - చరణ్ ఇద్దరూ నవ్వుతూ కనిపిస్తున్న ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఇద్దరి కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ పడితే బాక్సాఫీస్ బద్దలే అని వీరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బాహుబలి' సినిమాతో వచ్చిన క్రేజ్ ని కాపాడుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే 'రాధే శ్యామ్' చిత్రాన్ని చివరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్.. మరో మూడు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ నీల్ తో 'సలార్'.. ఓం రౌత్ తో 'ఆదిపురుష్'.. నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయనున్నాడు ప్రభాస్. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో దేశవ్యాప్తంగా సత్తా చాటడానికి చరణ్ రెడీ అవుతున్నాడు.