దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''సీతా రామం''. ఇందులో రష్మిక మందన్నా - సుమంత్ కీలక పాత్రలు పోషించారు. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ తో దర్శకుడు హను రాఘవపూడి ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించారు.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన 'సీతా రామం' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ వేడుక రేపు బుధవారం సాయంత్రం గ్రాండ్ గా జరగనుంది.
'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బిగ్ సర్ప్రైజ్ అంటూ చిత్ర బృందం ఊరిస్తూ వచ్చిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 'డియర్ రామ్.. నీ కోసం నేను వస్తున్నాను' అంటూ ఓ వీడియోని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ ప్రస్తుతం 'ప్రాజెక్ట్ K' అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'సీతా రామం' సినిమా ఈవెంట్ కు రానున్నట్లు అర్థం అవుతుంది. ఇటీవల వైజయంతీ మూవీస్ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కు కూడా ప్రభాస్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. అలానే ఇదే బ్యానర్ లో రూపొందిన 'జాతిరత్నాలు' సినిమాకూ డార్లింగ్ తనవంతు సపోర్ట్ అందించారు.
అయితే ఇటీవల అశ్వినీదత్ మీడియాతో మాట్లాడుతూ.. 'సీతారామం' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ కాలి సర్జరీ కోసం విదేశాల్లో ఉండటంతో రాలేకపోతున్నాడని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం డార్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' మూవీ తెరకెక్కుతోంది. ఇందులో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ - దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతో ఈ సినిమా తీస్తున్నారు. ఇది ఎవెంజర్స్ రేంజ్ లో ఉంటుందని నిర్మాత అశ్వినీదత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
చైనా - అమెరికా వంటి ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ సినిమాని నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తామని అశ్వినీదత్ పేర్కొన్నారు. 'ప్రాజెక్ట్ కె' మూవీ 2024 దసరా కానుకగా అక్టోబర్ 24న లేదా సంక్రాంతి సందర్భంగా 2025 జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అగ్ర నిర్మాత వెల్లడించారు.